News October 22, 2024

గుర్ల ఘటన.. విచారణ అధికారిగా విజయానంద్ 

image

గుర్ల గ్రామంలో డయేరియా విజృంభణపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి కె.విజయానంద్(ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి) నేడు విజయనగరం జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలో అధికారులతో సమావేశమై ఘటనకు కారణాలు తెలుసుకుంటారు. అనంతరం గుర్ల బయలుదేరి వెళ్లి అక్కడ స్థానికులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులపై విచారించి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

Similar News

News November 19, 2025

ఉత్త‌రాంధ్ర‌లో అంచ‌నాల కమిటీ ప‌ర్య‌ట‌న‌

image

AP అంచ‌నాల క‌మిటీ ఈనెల 25-29 వ‌రకు ఉత్త‌రాంధ్రలో ప‌ర్య‌టించ‌నుంది. ఛైర్మ‌న్ వేగుళ్ల జోగేశ్వ‌రరావు అధ్య‌క్ష‌త‌న క‌మిటీ స‌భ్యులు 25న విశాఖ‌ చేరుకుంటారు. 26న పలు సమీక్షల అనంతరం విజయనగరం చేరుకొని రామనారాయ‌ణాన్ని సందర్శిస్తారు. 27న పైడిత‌ల్లమ్మని ద‌ర్శించుకొని క‌లెక్ట‌రేట్లో అధికారుల‌తో స‌మావేశ‌మవుతారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రాల్లో జ‌రిగిన ప‌నుల‌కు సంబంధించిన అంశాల‌పై స‌మీక్షిస్తారు.

News November 19, 2025

VZM: ‘100 రోజుల యాక్షన్ ప్లాన్‌కు సిద్ధం కావాలి’

image

పదో తరగతిలో ఈసారి మరింత మెరుగైన ఫలితాల సాధనకు డిసెంబర్ 5వ తేదీ లోపు సిలబస్ పూర్తిచేయాలని DEO మాణిక్యం నాయుడు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడారు. గత ఏడాది 87% పాస్ రేట్‌తో 7వ స్థానంలో నిలిచిందన్నారు. ఈసారి మరింత మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులందరూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మొత్తం సిలబస్ పూర్తి చేసి, 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని అన్నారు.

News November 19, 2025

సకాలంలో లక్ష్యాల‌ను సాధించాలి: కలెక్టర్

image

భూసేకరణ కేసుల్లో పూర్తి డేటా సిద్ధం చేసి, ప్రజాభ్యంతరాలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై అధికారులతో మంగళవారం సమీక్ష జరిపారు. రోడ్డు ప్రాజెక్టులు, రైల్వే మూడవ, నాలుగవ లైన్ భూసేకరణను వేగవంతం చేయాలని, పారిశ్రామిక పార్కుల్లో కొత్త యూనిట్ల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.