News February 5, 2025

గుల్లకోటల: బావిలో పడి బాలుడి మృతి

image

ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో 3 సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు చేద బావిలో పడి బుధవారం మృతిచెందాడు. మంత్రి రంజిత్, శిరీష దంపతుల చిన్న కుమారుడు లడ్డు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రుల ఇంటి వెనకాల వాళ్ల అమ్మమ్మ ఇల్లు ఉంటుందని, రెండిళ్ల మధ్యలో చేద బావి ఉంటుందని, బాలుడు కనిపించకపోవడంతో బావిలో పడి ఉండటం చూసి బయటకు తీసి ధర్మారం ఆస్పత్రికి తీసుకుపోగా అప్పటికే బాలుడు మృతి చెందాడు.

Similar News

News December 13, 2025

రాజయ్యపేట: ‘బల్క్ డ్రగ్ పార్క్‌కు అంగీకరించే ప్రసక్తే లేదు’

image

సీఎం చంద్రబాబుతో ఈనెల 16వ తేదీన భేటీ అయ్యే మత్స్యకార ప్రతినిధులు శనివారం నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సమావేశం అయ్యారు. బల్క్ డ్రగ్ పార్క్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని వారు నిర్ణయం తీసుకున్నారు. బొమ్మల పరిశ్రమ, షుగర్ ఫ్యాక్టరీలు లాంటి ప్రజలకు హాని కలగని పరిశ్రమల ఏర్పాటుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని వారు పేర్కొన్నారు. సీఎంతో మాట్లాడే అంశాలపై మత్స్యకార నాయకులు చర్చించారు.

News December 13, 2025

బేబీ మసాజ్‌కు బెస్ట్ ఆయిల్స్ ఇవే..

image

పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. అయితే దీనికోసం ప్లాంట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నా కూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించొచ్చంటున్నారు. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఆభరణాలు ఉండకుండా చూసుకోవాలి.

News December 13, 2025

చలికాలం.. కోళ్ల దాణా నిల్వలో జాగ్రత్తలు

image

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడి దాణా చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.