News February 5, 2025
గుల్లకోటల: బావిలో పడి బాలుడి మృతి

ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో 3 సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు చేద బావిలో పడి బుధవారం మృతిచెందాడు. మంత్రి రంజిత్, శిరీష దంపతుల చిన్న కుమారుడు లడ్డు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రుల ఇంటి వెనకాల వాళ్ల అమ్మమ్మ ఇల్లు ఉంటుందని, రెండిళ్ల మధ్యలో చేద బావి ఉంటుందని, బాలుడు కనిపించకపోవడంతో బావిలో పడి ఉండటం చూసి బయటకు తీసి ధర్మారం ఆస్పత్రికి తీసుకుపోగా అప్పటికే బాలుడు మృతి చెందాడు.
Similar News
News February 16, 2026
ఏటా 2 ఇంజెక్షన్లు.. బీపీకి చెక్!

మారిన జీవన శైలి కారణంగా చాలా మంది చిన్న వయసులోనే BP బారిన పడుతున్నారు. దాన్ని నియంత్రించుకునేందుకు రోజూ మాత్రలు వాడుతున్నారు. ఇకపై ఆ అవసరం ఉండకపోవచ్చు. ఏటా 2 ఇంజెక్షన్లు వేయించుకుంటే సరిపోతుంది. ఈ మేరకు USకు చెందిన రోచీ అండ్ అల్నిలమ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ జిలెబెసిరన్ అనే ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉందని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
News February 16, 2026
పాలమూరు వర్సిటీ: రీకౌంటింగ్ ఫీజు చెల్లింపునకు నేడే ఆఖరు

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ విద్యార్థులు రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. ఫలితాలపై సందేహాలున్న వారు సబ్జెక్టుకు రూ.300 చొప్పున ఫీజు చెల్లించి, సంబంధిత పత్రాలను కాలేజీలో సమర్పించాలని అధికారులు సూచించారు.
News February 16, 2026
ఏటి ఈతకు లంక మేతకు సరి

ఒక పశువు నదిని (ఏరు) ఈదుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న లంక భూమికి వెళ్తుంది. అక్కడ కడుపు నిండా మేత మేస్తుంది. కానీ తిరిగి ఇంటికి రావాలంటే మళ్ళీ అదే నదిని ఈదుకుంటూ రావాలి. ఆ ఈతలో పడే కష్టం వల్ల మేసిన మేత అంతా అరిగిపోతుంది. అంటే, ఆ పశువుకు మేత వల్ల వచ్చిన శక్తి, నదిని ఈదడానికే ఖర్చయిపోతుంది. ఎవరైనా ఒక పనిలో ఎంత సంపాదిస్తున్నారో అదంతా ఆ పని చేయడానికే ఖర్చయిపోతే లాభంలేదని చెప్పడానికి ఈ సామెత వాడతారు.


