News March 6, 2025

గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

image

కడప-రాయచోటి హైవేపై గల గువ్వలచెరువు ఘాట్‌లో బుధవారం జరగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కారును తప్పించబోయి లారీ లోయలో పడింది. ఈ ఘటనలో ఏలూరుకు చెందిన లారీ డ్రైవర్ సాంబయ్య (48), నరసరావుపేటకు చెందిన క్లీనర్ నాగరాజు(50) అక్కడికక్కడే మృతి చెందారు. లారీలో ప్రయాణిస్తున్న చక్రాయపేట మండలానికి చెందిన వివేకానందరెడ్డి(43కి) తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News March 6, 2025

భూ సమస్యల పరిష్కారానికి చర్యలు: MNCL కలెక్టర్

image

జిల్లాలో శాంతిభద్రతలకు అవరోధంగా మారే భూసంబంధిత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మండల, సబ్ డివిజన్, జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేసే కమిటీ ప్రతినిధులు ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి గ్రీవెన్స్ నంబర్ కేటాయిస్తారన్నారు. సందేహాల నివృత్తికి 08736 250106 కాల్ చేయాలని సూచించారు.

News March 6, 2025

ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్

image

ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ చిక్కుకున్నారు. ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ధర్మపురిలో ఎప్పటి నుంచో ఈ అవినీతి జరుగుతుందనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి.

News March 6, 2025

బిగ్‌బాస్ సీజన్-9కు కొత్త హోస్ట్?

image

టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో తొమ్మిదో సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈసారి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఉండకపోవచ్చని సమాచారం. ఎనిమిదో సీజన్‌కు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ లేకపోవడంతో హోస్ట్‌గా ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. మరి ఈ షోను ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.

error: Content is protected !!