News July 5, 2024
గువ్వలచెరువు ఘాట్ సొరంగ మార్గానికి రూ.1000 కోట్లు
కడప – రాయచోటి మార్గమధ్యలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న వాహనదారుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. ప్రమాదకరంగా ఉండే ఈ ఘాట్‌కు ప్రత్యామ్నాయంగా.. ఆ కొండకు సొరంగం తవ్వి, నాలుగు వరుసల రహదారి నిర్మించేందుకు కేంద్రం రూ.1,000 కోట్లు నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం 14 జాతీయ రహదారులకు రూ.4,744 కోట్లతో 2024-25 వార్షిక ప్రణాళికకు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
Similar News
News December 13, 2024
కీలక విషయాలు బయటపెట్టిన కడప కలెక్టర్
సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో కడప కలెక్టర్ శ్రీధర్ కీలక విషయాలు బయటపెట్టారు. ‘వేరే జిల్లాలో ఇచ్చిన సదరం సర్టిఫికెట్‌తో మా జిల్లాలో 3,600 మంది పింఛన్ తీసుకుంటున్నారు. వీరిపై అనుమానంతో తనిఖీలు చేయగా కేవలం 127 మందే అర్హులని తేలింది. మిగిలిన వాళ్లు ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకున్నారు’ అని CMకు చెప్పారు. వెంటనే వారి నుంచి పెన్షన్ డబ్బులు రికవరీ చేసి.. అవసరమైతే కేసు పెట్టాలని CM ఆదేశించారు.
News December 13, 2024
రాజంపేట: ఆటో డ్రైవర్ సూసైడ్
రాజంపేట మండలం ఆకేపాడు నవోదయ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ రాజశేఖర్ (37) కుటుంబ కలహాలతో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. మద్యానికి బానిసైనా రాజశేఖర్ ఇంట్లో తన భార్య డ్వాక్రా కోసం ఉంచుకున్న డబ్బులు, కొంత నగలు అమ్మి మద్యానికి ఖర్చు చేశాడు. దీంతో భార్యాభర్తల ఇరువురి మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన రాజశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 12, 2024
కడప: వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు ఎప్పుడంటే?
కడప : పలు కారణాలరీత్యా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలల సెమిస్టర్ల పరీక్షల కోసం కొత్త తేదీలను వైవీయూ సీఈ ఆచార్య కె.కృష్ణారావు వెల్లడించారు. ఈనెల 2 తేదీన జరగాల్సిన పరీక్షలు ఇదేనెలలో 23వ తేదీన నిర్వహిస్తామన్నారు. ఈ నెల 3 తేదీన జరగాల్సిన పరీక్ష 21వ తేదీ ఉంటుందని సీఈ తెలిపారు. విద్యార్థులు సంబంధిత తేదీలలో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.