News July 10, 2024
గూగుడు చరిత్ర గురించి మీకు తెలుసా..?
గూగూడు అనే ప్రాంతంలో గుహుడు అనే మహర్షి శ్రీరాముడి రాక కోసం ఆశ్రమం ఏర్పాటుచేసుకుని తపస్సు చేశాడని అని ప్రతీక. పితృవాక్య పరిపాలన కోసం శ్రీరాముడు అరణ్యవాసానికి వెళుతున్న సమయంలో గుహుని ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించారని పురాణాలు చెబుతున్నాయి. తిరిగి వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు తిరుగు పయనంలో వస్తానని మాట ఇచ్చారని తెలిపారు. నాటి గుహుని ఆశ్రమమే కాలక్రమేణా గూగుడుగా మారిందని ప్రతీతి.
Similar News
News October 13, 2024
అనంత జిల్లాలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి వేడుకలు: మంత్రి లోకేశ్
అనంతపురం జిల్లాలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతిని నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. టీడీపీ బీసీల పుట్టినిల్లు అన్నారు. వారి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఈనెల 17న అధికారికంగా అన్ని జిల్లా కేంద్రాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
News October 13, 2024
చిలమత్తూరు: గ్యాంగ్ రేప్ చేసింది వాళ్లేనా..?
శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో అత్త, కోడలిపై గ్యాంగ్ రేప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. హిందూపూర్‌కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారని తెలుస్తోంది. నిందితులంతా చిల్లర దొంగలని సమాచారం.
News October 13, 2024
గ్యాంగ్ రేప్ బాధాకరం: పయ్యావుల
బళ్లారి నుంచి ఉపాధి కోసం వచ్చి చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లిలో అత్తా కోడలిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. పొట్టకూటి కోసం వచ్చిన అత్తా కోడలిపై గ్యాంగ్ రేప్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇది అత్యంత బాధాకరమని చెప్పారు.