News December 11, 2024
గూగుల్‌తో ఎంవోయూ చేసుకున్నాం: సీఎం చంద్రబాబు

అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ముందు విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నామన్నారు. ఇటీవల విశాఖలో గూగుల్ ప్రతినిధులు పర్యటించి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. గూగుల్ విశాఖకు వచ్చాక గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. డేటా సెంటర్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డీప్‌టెక్, సీకేబుల్ వచ్చాక ప్రపంచానికే విశాఖ సర్వీస్ సెంటర్ అవుతుందని పేర్కొన్నారు.
Similar News
News January 8, 2026
విశాఖ మీదుగా వెళ్లే ‘వివేక్ ఎక్స్‌ప్రెస్’ రీషెడ్యూల్

కన్యాకుమారి – దిబ్రూగఢ్ వివేక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22503) నేడు (08.01.2026) రీషెడ్యూల్ చేయబడింది. సాయంత్రం 5:25 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 9 గంటలకు బయలుదేరుతోంది. దీనివల్ల రేపు రాత్రి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకోవాల్సిన ఈ రైలు సుమారు 4 గంటల ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
News January 8, 2026
విశాఖలో రేపటి నుంచి లైట్ హౌస్ ఫెస్టివల్

విశాఖలోని రేపటి నుంచి రెండు రోజులు పాటు లైట్ హౌస్ ఫెస్టివల్ పేరిట కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ వెల్లడించారు. ఎంజీఎం పార్కు మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ ఫెస్టివల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని అధికారులు తెలిపారు.
News January 8, 2026
విశాఖలో జనవరి 9న డిజిటల్ టెక్ సమ్మిట్

రెండో ఎడిషన్ AP డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్-2026 ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సదస్సు ఉ.9.15 నుంచి సా.5.30 గంటల వరకు VMRDA చిల్డ్రన్స్ అరీనాలో జరగనుంది. సదస్సు తొలి రోజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతారు. 2వ రోజు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు IT, AI నిపుణులు, స్టార్టప్ ప్రతినిధులు, పరిశోధక విద్యార్థులతో సహా సుమారు 800 మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.


