News June 27, 2024
గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలకు వేళాయె
జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలను జులై 7న ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 13 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జులై 7న స్వామి వారి తొలి దర్శనం, 9న అగ్నిగుండం ఏర్పాటు, 12న ఐదవ సరిగెత్తు, 14న చిన్న సరిగెత్తు, 16న పెద్ద సరిగెత్తు, 17న అగ్నిగుండం ప్రవేశం, 19న స్వామి వారి చివరి దర్శనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.
Similar News
News December 27, 2024
అటవీ సంరక్షణ కమిటీతో కలెక్టర్ చేతన్ సమీక్ష
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతన్ జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా ఎస్పీ రత్న హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు హాని జరగకుండా చూడాలని ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చిలో చెట్లు నాటే కార్యక్రమానికి అవసరయ్యే మొక్కలకు నర్సరీలు ఏర్పాటు చేసి పెంచాలని సూచించారు.
News December 27, 2024
అనంతపురం జిల్లాతో మన్మోహన్ సింగ్కు అనుబంధం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అనంతపురం జిల్లాతో అనుబంధం ఉంది. 2006లో నార్పల మండలంలోని బండ్లపల్లి నుంచే దేశంలోనే తొలిసారిగా ఉపాధి హామీ పథకాన్ని అప్పటి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీతో కలిసి ప్రారంభించారు. ఆ పథకం ప్రారంభించిన పదేళ్ల తర్వాత 2016లో ఆయన రాహుల్ గాంధీతో కలిసి జిల్లాకు వచ్చారు. అప్పటి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో బండ్లపల్లిలో ప్రజలతో మమేకమై ఉపాధిహామీ సమస్యలను తెలుసుకున్నారు.
News December 26, 2024
30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు: అనంత ఎస్పీ
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి జనవరి 17 వరకు నీలం సంజీవరెడ్డి మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పురుషులు 5,242, మహిళలు 1,237 మంది హాజరవుతారని అన్నారు.