News April 3, 2025

గూడూరులో ఎంటెక్ విద్యార్థి మృతి

image

గూడూరులో ఓ ఎంటెక్ విద్యార్థి చనిపోయాడు. స్థానికంగా ఉన్న ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో జశ్వంత్ ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో కాలేజీ బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి అతను దూకేశాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కాలేజీ యాజమాన్యం వేధింపులతోనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Similar News

News October 15, 2025

ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

మనుబోలు(M) కాగితాలపూరు క్రాస్ రోడ్‌లోని పంజాబీ డాబా పక్కనే ఉన్న పొదలలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. జట్లకొండూరుకు చెందిన కసుమూరు రమేశ్(18) వేప చెట్టుకు ఉరి వేసుకుని ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. SI శివ రాకేశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరుకు తరలించారు.

News October 15, 2025

పింఛన్ల పునఃపరిశీలన మూడు రోజులు పాటు బంద్

image

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న పింఛన్ల పునఃపరిశీలన కార్యక్రమాన్ని మూడు రోజులు పాటు నిలిపివేసినట్లు డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులు పాటు పర్యటించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సచివాలయ సంబంధ శాఖ అధికారులు దివ్యాంగులకు తెలియజేయాలని సూచించారు.

News October 15, 2025

నెల్లూరు TDP నేతల తీరుపై పల్లా ఆగ్రహం..?

image

జిల్లా TDP నేతలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టడంపై అధిష్ఠానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలకు ఫోన్లు చేసి పార్టీ క్రమశిక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, దానిని కాపాడుకోవాలని హితవు పలికారట.