News December 19, 2024
గూడూరులో దుకాణానికి వచ్చిన బాలిక పట్ల అసభ్య ప్రవర్తన

11 ఏళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో ఓ వ్యక్తికి గూడూరు కోర్టు జైలు శిక్ష విధించింది. గూడూరు రాణీపేట పేటకు చెందిన జనార్దన్ చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణానికి వచ్చిన బాలిక పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈకేసులో సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించింది.
Similar News
News July 6, 2025
నెల్లూరులో రొట్టెల పండుగ.. తొలిరోజే జనం కిటకిట

నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు దగ్గర బారాషహీద్ దర్గాలో సోమవారం రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తులు పలు రాష్ట్రాల నుంచి రొట్టెల పండుగ ప్రాంగణానికి విచ్చేశారు. స్వర్ణాల చెరువులో కోర్కెలు తీర్చే విధంగా భక్తులు రొట్టెలు పంచుకుంటున్నారు. ప్రారంభమైన తొలిరోజే భక్తుల తాకిడి ఎక్కువైంది. క్యూలైన్ల అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
News July 6, 2025
రేపటి నుంచి పెరగనున్న భక్తుల రద్దీ

నెల్లూరులోని బారాషహిద్ దర్గా వద్ద నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం కానుంది. అన్ని గ్రామాల్లో జరుగుతున్న మొహర్రం వేడుకలు ఆదివారంతో ముగుస్తాయి. దీంతో నేడు బారాషహిద్ దర్గా వద్ద భక్తుల రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సోమవారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే దర్గా వద్ద పోలీస్ అధికారులు 1700 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
News July 6, 2025
నేటి నుంచే రొట్టెల పండుగ.. షెడ్యూల్ ఇదే.!

➠ జులై 6వ తేదీ రాత్రి సందల్ మాలి
➠ 7వ తేదీ రాత్రి గంధం మహాత్సవం
➠ 8వ తేదీ రొట్టెల పండుగ
➠ 9వ తేదీ తహలీల్ ఫాతేహ
➠ 10వ తేదీ ముగింపు వేడుకలు
ఈ మేరకు ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు నెల్లూరుకు తరలి వస్తున్నారు.