News February 27, 2025
గూడూరు ఆదిశంకర కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిశంకర కాలేజీ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి టాటా ఏసీ వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వెంకటేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 28, 2025
ప్రపంచ స్టాక్ మార్కెట్లు క్రాష్.. ఇన్వెస్టర్ల ‘రక్తకన్నీరు’

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. మునుపెన్నడూ చూడని రీతిలో విలవిల్లాడుతున్నాయి. నిన్న US సూచీలు భారీగా నష్టపోయాయి. నాస్డాక్ 2.75, S&P500 1.28, నేడు నిక్కీ 2.94, హాంగ్సెంగ్ 2.36, జకార్తా కాంపోజిట్ 2.85, సెట్ కాంపోజిట్ 1.63, నిఫ్టీ 1.6, సెన్సెక్స్ 1.37% మేర పతనమయ్యాయి. అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నేడు మీ పోర్టుఫోలియో ఎలా ఉంది?
News February 28, 2025
ద్వారకాతిరుమల: నిమ్మకాయలు అమ్మిన సినీ నటుడు షఫీ

ప్రముఖ క్షేత్రం ద్వారకాతిరుమలలో సినీ నటుడు షఫీ నిమ్మకాయలు అమ్మి సందడి చేశారు. నిన్న ఆయన మరో నటుడు మాణిక్ రెడ్డితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో లింగయ్య చెరువు వద్ద నిమ్మకాయలు అమ్మే మహిళా వ్యాపారులు ఆయన కారును ఆపి, వాటిని కొనాలని కోరారు. వెంటనే కారు దిగిన షఫీ తాను నిమ్మకాయలు అమ్ముతాను అంటూ, వారితో కలిసి సందడి చేశారు.
News February 28, 2025
SLBCలో సహాయ చర్యల కోసం వెళుతున్న సింగరేణి రెస్క్యూ

SLBCలో సహాయక చర్యలు చేపట్టేందుకు సింగరేణి సంస్థకు సంబంధించిన రెస్క్యూ సిబ్బందిని ఇప్పటికే వంద మందిని అత్యాధునిక సహాయ సామగ్రితో పంపించినట్లు C&MDబలరాం పేర్కొన్నారు. అవసరానికి అనుగుణంగా మరొక 200 మంది రెస్క్యూ సిబ్బందిని అదనంగా పంపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ సిబ్బందిని C&MDఅభినందించారు. సొరంగం లో చిక్కుకున్న వారు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.