News February 27, 2025
గూడూరు ఆదిశంకర కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిశంకర కాలేజీ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి టాటా ఏసీ వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వెంకటేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 23, 2025
పర్చూరుకు రానున్న సీఎం చంద్రబాబు

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీన పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్నారు. చంద్రబాబు బాబు పర్యటన ఖరారు అయినట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనపై కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ జె. వెంకట మురళి ఆదివారం సమావేశం నిర్వహించారు.
News March 23, 2025
అమలాపురం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమలాపురం డిపో నుంచి ఏప్రిల్ 5న ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కళ్యాణం పూర్తయిన తర్వాత భద్రాచలం నుంచి అమలాపురం రావడానికి మధ్యాహ్నం1:30 నుంచి రాత్రి 7 గంటల వరకు బస్సులు నడుపుతామన్నారు.
News March 23, 2025
అమెరికాలో కాల్పులు.. భారత్‌కు చెందిన తండ్రి, కూతురు మృతి

అమెరికాలో దుండగుడి కాల్పుల్లో గుజరాత్‌కు చెందిన ప్రదీప్(56), ఆయన కుమార్తె ఊర్మి(26) మృతిచెందారు. వీరు వర్జీనియాలో డిపార్ట్‌మెంటల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. నిందితుడు ఉదయాన్నే ఆ షాపు వద్దకు వచ్చి గొడవకు దిగారు. రాత్రి నుంచి మద్యం కోసం వేచి ఉంటే షాపు ఎందుకు మూసేశారని గన్‌తో కాల్పులకు దిగాడు. ప్రదీప్ అక్కడికక్కడే చనిపోగా, ఊర్మి ఆస్పత్రిలో మరణించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.