News March 6, 2025
గూడూరు: ‘ఇసుకలో తల ఇరుక్కొని చనిపోయాడు’

గూడూరు మండలం చిర్రకుంట తండాలో బుధవారం వ్యక్తి మరణించడంతో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిర్రకుంటతండాకు చెందిన భూక్య రాజ్ కుమార్ తన వ్యవసాయ పంట పొలాల్లో కోతుల బెడద వల్ల ఇబ్బంది పడుతున్నాడు. కాగా కోతులు ఆవాసం ఏర్పరచుకున్న చెట్టు కొమ్మలను నరికి వేసే క్రమంలో చెట్టు పైనుంచి జారిపడ్డాడు. చెట్టు కింద వాగు ఇసుకలో తల కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News December 1, 2025
నస్పూర్: ‘ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి’

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారులకు అవసరమైన శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు, బ్యాలెట్ పేపర్ల నిర్వహణ, పోలింగ్ రోజున ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించారు.
News December 1, 2025
రైతులు అప్రమత్తంగా ఉండాలి: శ్రీకాకుళం కలెక్టర్

దిత్వా తుఫాను సందర్భంగా రైతులు తమ పంటలపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొన్ని మండలాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాకు దిత్వా తుఫాను ప్రభావం లేనప్పటికీ జిల్లా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News December 1, 2025
కోలుకున్న గిల్, హార్దిక్.. సౌతాఫ్రికాతో టీ20లు ఆడే ఛాన్స్!

గాయాల కారణంగా కొన్ని రోజులుగా క్రికెట్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ హార్దిక్ కోలుకున్నట్లు సమాచారం. హార్దిక్ T20లలో ఆడేందుకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ క్లియరెన్స్ ఇచ్చినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. గిల్‌కు కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. దీంతో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో వీరు ఆడే ఛాన్స్ ఉంది. వీరి రాకతో టీమ్ ఇండియా బలం పెరగనుంది.


