News March 6, 2025
గూడూరు: ‘ఇసుకలో తల ఇరుక్కొని చనిపోయాడు’

MHBD జిల్లా గూడూరు మండలం చిర్రకుంట తండాలో బుధవారం వ్యక్తి మరణించడంతో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిర్రకుంటతండాకు చెందిన భూక్య రాజ్ కుమార్ తన వ్యవసాయ పంట పొలాల్లో కోతుల బెడద వల్ల ఇబ్బంది పడుతున్నాడు. కాగా, కోతులు ఆవాసం ఏర్పరచుకున్న చెట్టు కొమ్మలను నరికి వేసే క్రమంలో చెట్టు పైనుంచి జారిపడ్డాడు. చెట్టు కింద వాగు ఇసుకలో తల కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News February 24, 2026
హనుమకొండ: రోడ్డు ప్రమాదాలపై అవేర్నెస్ పెంచండి: CP

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమం ద్వారా పోలీస్ అధికారులు వారివారి స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలపై ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జరిగే నష్టాలపై ప్రజలకు అవెర్నెస్ కల్పించాలని వరంగల్ CP అధికారులను అదేశించారు. అలాగే కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల గురించి వివరించాలన్నారు.
News February 24, 2026
హోలీ పండుగ ఎప్పుడంటే?

ఈ ఏడాది హోలీని ఏ తేదీన(మార్చి 3 or 4) జరుపుకోవాలన్న సందిగ్ధత ప్రజల్లో నెలకొంది. దీనిపై పండితులు క్లారిటీ ఇచ్చారు. ధ్రుక్ పంచాంగం ప్రకారం హోలికా దహనం మార్చి 3న, రంగుల హోలీని మార్చి 4న జరుపుకోవాలని తెలిపారు. ఫాల్గుణ పౌర్ణమి తిథి మార్చి 2న సాయంత్రం 5.55 నుంచి మార్చి 3 సా.5.07 వరకు ఉంటుందంటున్నారు. అయితే 3వ తేదీన చంద్ర గ్రహణం ఉండటం వల్ల 4న పండుగ చేసుకోవాలని సూచిస్తున్నారు.
News February 24, 2026
విశాఖలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

విశాఖలోని మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మురళి నగర్ జాతీయ రహదారిపై స్కూటీపై వెళుతున్న వ్యక్తిని విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సు ఢీకొనడంతో అక్కడకక్కడ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


