News January 26, 2025
గూడూరు: ఉత్తమ బీఎల్‌వో అవార్డు అందుకున్న లక్ష్మయ్య

గూడూరు మండలం మట్టెవాడ బూత్ లెవెల్ ఆఫీసర్(BLO) హరిబండి లక్ష్మయ్య నేడు ఉత్తమ బీఎల్‌వోగా అవార్డు అందుకున్నారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అవార్డు అందజేశారు. ఓటర్ల నమోదు, పోలింగ్ సంబంధిత ఏర్పాట్లు చేయడంలో చురుకైన పాత్ర పోషించినందుకు గాను లక్ష్మయ్యకు ఈ గౌరవం దక్కింది. గ్రామస్థులు లక్ష్మయ్యను అభినందించారు.
Similar News
News October 31, 2025
వరకట్న నిషేధ చట్టంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

వరకట్న నిషేధ చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. వరకట్న నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగింది. గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. యువతలో ఎక్కువగా అవగాహన కల్పించాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
News October 31, 2025
₹10,000 cr సాయానికి AI అభ్యర్థన

అహ్మదాబాద్‌లో బోయింగ్-787 కుప్పకూలిన తర్వాత ఎయిర్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ ప్రమాదంలో 260మందికి పైగా మరణించారు. దీంతో నియంత్రణ నిబంధనలు కఠినమై సర్వీసుల నిర్వహణ కష్టంగా మారింది. ప్రాంతీయ ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ఎయిర్ రూట్లలో దూరం పెరిగి ఖర్చుల భారం పెరిగింది. వీటి నుంచి బయటపడేందుకు ₹10,000CR సాయం అందించాలని యాజమాన్య సంస్థలు టాటాసన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను AI అర్థించింది.
News October 31, 2025
పెద్దపల్లి: ఎన్‌సీడీ కార్యక్రమంపై సమీక్షా సమావేశం

పెద్దపల్లి కలెక్టరేట్‌లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) కార్యక్రమంపై నర్సింగ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లతో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.వాణిశ్రీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్‌సీడీ వెబ్‌సైట్‌లో వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, అప్డేట్ చేయని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 13 ఉప కార్యక్రమాల అమలు, ప్రజారోగ్య పరిరక్షణ ప్రాముఖ్యతపై సమగ్ర మార్గదర్శకాలు జారీ చేశారు.


