News January 26, 2025
గూడూరు: ఉత్తమ బీఎల్‌వో అవార్డు అందుకున్న లక్ష్మయ్య

గూడూరు మండలం మట్టెవాడ బూత్ లెవెల్ ఆఫీసర్(BLO) హరిబండి లక్ష్మయ్య నేడు ఉత్తమ బీఎల్‌వోగా అవార్డు అందుకున్నారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అవార్డు అందజేశారు. ఓటర్ల నమోదు, పోలింగ్ సంబంధిత ఏర్పాట్లు చేయడంలో చురుకైన పాత్ర పోషించినందుకు గాను లక్ష్మయ్యకు ఈ గౌరవం దక్కింది. గ్రామస్థులు లక్ష్మయ్యను అభినందించారు.
Similar News
News February 8, 2025
ఫిబ్రవరి 8: చరిత్రలో ఈరోజు

✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో)
✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం
✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం
✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం
✒ 1957: నటి వై.విజయ జననం
✒ 1963: IND మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ జననం(ఫొటోలో)
News February 8, 2025
దిలావర్పూర్: ఆయిల్ ఫామ్‌తో రైతులకు లాభసాటి

ఆయిల్ ఫామ్ మొక్కలను నాటుకోవడంతో రైతులకు లాభదాయకంగా ఉంటుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి వి. రమణ అన్నారు. దిలావర్పూర్ మండలంలో ఆయా రైతులు నాటిన తోటలను సందర్శించారు. అనంతరం రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలపై రాయితీ వివరాలు తెలిపారు. మొక్కలు నాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను పేర్కొన్నారు. ఇందులో డివిజన్ మేనేజర్ శేఖర్, క్లస్టర్ ఆఫీసర్ ప్రశాంత్, రైతులు ఉన్నారు.
News February 8, 2025
కాగజ్‌ననగర్: పట్టభద్రులు భాజపా అభ్యర్థిని పట్టం కట్టండి: ఎమ్మెల్యే

కరీంనగర్‌లోని కలెక్టరేట్ భవనంలో బీజేపీ ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజి రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. శాసనమండలి బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డిని గెలిపించాలని కోరారు. వీరితో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఉన్నారు.