News March 9, 2025

గూడూరు: గొంతులో పల్లీ ఇరుక్కొని బాలుడి మృతి

image

గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. 18 నెలల బాలుడు గుండెల అక్షయ్ ఆడుకుంటూ పల్లీ గింజ నోట్లో వేసుకున్నాడు. గొంతులో పల్లీ గింజ ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక చనిపోయాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆడుతూ, పాడుతూ ఇంట్లో తిరిగే బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 21, 2025

వికారాబాద్ నూతన ఎస్పీగా స్నేహ మెహ్రా

image

రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన ఎస్పీగా స్నేహ మెహ్రాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీగా నారాయణరెడ్డి ఉన్న సమయంలోనే లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటన జరిగింది.

News November 21, 2025

ఉద్దానం కిడ్నీ వ్యాధులపై పరిశోధన ప్రారంభం

image

శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం ప్రారంభించామని కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టు మెంటర్ డా.టి.రవిరాజు అన్నారు. ఉద్దానం ప్రాంతంలో 18% జనాభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.6.01కోట్లు ఖర్చు అవుతుందని అంచానా వేశారు. ఇచ్చాపురం, కంచిలి, పలాస, కవిటి, మందస, వజ్రపు కొత్తరు ప్రాంతాల్లో పరిశోధన చేస్తున్నామన్నారు.

News November 21, 2025

మొక్కలకు బోరాన్ ఎందుకు అవసరం?

image

బోరాన్ అనే ఈ సూక్ష్మధాతు మూలకం బోరిక్ యాసిడ్ స్థితిలో మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. ఇది మొక్కల్లో, నేలల్లో నిశ్చల స్థితిలో ఉంటుంది. మొక్క ఆకులలో తయారయ్యే ఆహారాన్ని అన్ని భాగాలకు చేరవేయడంలో బోరాన్ కీలక పాత్ర పోషిస్తుంది. మొక్కల సంపర్క ప్రక్రియలో ఉపయోగపడే పుప్పొడి ఉత్పత్తిలో, పుప్పొడి కణాల ఎదుగుదలను నియంత్రిస్తూ విత్తన, పండ్ల ఎదుగుదలను నిలువరిస్తుంది. మొక్క కాల్షియం గ్రహించడానికి తోత్పడుతుంది.