News March 9, 2025
గూడూరు: గొంతులో పల్లీ ఇరుక్కొని బాలుడి మృతి

గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. 18 నెలల బాలుడు గుండెల అక్షయ్ ఆడుకుంటూ పల్లీ గింజ నోట్లో వేసుకున్నాడు. గొంతులో పల్లీ గింజ ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక చనిపోయాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆడుతూ, పాడుతూ ఇంట్లో తిరిగే బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 10, 2025
BREAKING: తాండూరులో హెడ్ కానిస్టేబుల్ మృతి

వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ డివిజన్ పరిధి కరణ్‌కోట్ హెడ్ కానిస్టేబుల్ రాంచందర్ ఈరోజు కన్నుమూశారు. గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన సోమవారం జరిగింది. తాండూరు పట్టణం సీతారాంపేట్‌కు చెందిన రాంచందర్ పోలీసుశాఖలో పనిచేస్తున్నారు. గతంలో తాండూరు డీఎస్పీ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో చనిపోయారు.
News March 10, 2025
శంషాబాద్: విమానానికి తప్పిన ప్రమాదం

ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీస్ ఈరోజు ఉదయం 150 మంది ప్రయాణికులతో గోవా నుంచి శంషాబాద్ మీదుగా వైజాగ్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించడంతో పైలట్ సిద్ధమయ్యాడు. అప్పటికే రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న మరో విమానాన్ని గమనించి, అప్రమత్తమై గాల్లోకి లేపడంతో పెను ప్రమాదం తప్పింది.
News March 10, 2025
యాదగిరిగుట్టకు చేరుకున్న గవర్నర్ విష్ణు దేవ్ వర్మ

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో 10వ రోజు కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు యాదగిరిగుట్టకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వచ్చారు. ఆలయ ఈవో భాస్కర్ రావు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ గొప్పతనాన్ని ఈవో భాస్కరరావు, గవర్నర్ విష్ణు దేవ్ వర్మకు వివరించారు. మరికాసేపట్లో పూర్ణా హుతిలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొననున్నారు.