News March 9, 2025

గూడూరు: గొంతులో పల్లీ ఇరుక్కొని బాలుడి మృతి

image

గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. 18 నెలల బాలుడు గుండెల అక్షయ్ ఆడుకుంటూ పల్లీ గింజ నోట్లో వేసుకున్నాడు. గొంతులో పల్లీ గింజ ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక చనిపోయాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆడుతూ, పాడుతూ ఇంట్లో తిరిగే బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News April 14, 2026

NTR: నిప్పు రవ్వలు ఆర్పేందుకు వెళ్లి అగ్నికి ఆహుతైన మహిళ

image

వీరులపాడు మండలంలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. తాటిగుమ్మి గ్రామానికి చెందిన పి.అచ్చమ్మ (62) తన పొలంలో ఏర్పడిన అగ్ని రవ్వలను ఆర్పేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పు అంటుకుంది. దీంతో ఆమె శరీరమంతా తీవ్రంగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.

News April 14, 2026

రేపు ఇంటర్ ఫలితాలు: మంత్రి లోకేశ్

image

AP: రేపు (ఏప్రిల్ 15) ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఉదయం 10.31 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ వెల్లడిస్తామన్నారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
*Share It

News April 14, 2026

ATP: భార్యపై చాకుతో దాడి.. భర్త అరెస్ట్

image

అనంతపురంలో భార్యపై భర్త <<19650878>>చాకుతో దాడి<<>> చేసిన ఘటన తెలిసిందే. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు త్రీటౌన్ CI రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు ధ్రువీకరించారన్నారు. నిందితుడు రాజీవ్ కాలనీకి చెందిన రాజేష్, గాయపడిన తేజస్వినిది ప్రేమ వివాహమన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోగా, అడ్డు వచ్చిన లక్ష్మీనారాయణకు గాయాలయ్యాయన్నారు.