News September 11, 2024
గూడూరు: డీఎస్పీని ఆశ్రయించిన ప్రేమ జంట

తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట బుధవారం గూడూరు డీఎస్పీని ఆశ్రయించింది. గూడూరు పట్టణానికి చెందిన సాయికుమార్, బళ్లారికి చెందిన దివ్య గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో వారే పెళ్లిచేసుకుని డీఎస్పీని ఆశ్రయించారు. తమతల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని కాపాడాలని కోరారు. ప్రస్తుతం వారి జంట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 9, 2025
నెల్లూరు: కాలువలో డెడ్ బాడీ కలకలం

ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పరిధిలోని బుడ్డి డ్రైన్ సమీపంలో ముత్తుకూరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం మంగళవారం సాయంత్రం లభ్యమైంది. పంటకాలువలో కొట్టుకువచ్చిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. మూడు రోజుల క్రితం చనిపోయిన 45 సంవత్సరాల పురుషుడు మృతదేహంగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 9, 2025
జిల్లాలో 15, 16న ఎస్టిమేట్స్ కమిటీ పర్యటన: కలెక్టర్

రాష్ట్ర శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ ఈనెల 15, 16న రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈనెల 15 సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారన్నారు. 16న మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్లో తనతోపాటు ఇతర అధికారులతో ఎస్టిమేట్స్ కమిటీ 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సం.ల బడ్జెట్ అంచనాలపై సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు.
News December 9, 2025
రేపటి నుంచి టెట్ పరీక్షలు: నెల్లూరు DEO

రేపటి నుంచి ఈనెల 21 వరకు టెట్-2025 పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో బాలాజీరావు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లు ఆన్లైన్లోనే పొందవచ్చని పరీక్షా కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని సూచించారు.


