News September 11, 2024
గూడూరు: డీఎస్పీని ఆశ్రయించిన ప్రేమ జంట
తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట బుధవారం గూడూరు డీఎస్పీని ఆశ్రయించింది. గూడూరు పట్టణానికి చెందిన సాయికుమార్, బళ్లారికి చెందిన దివ్య గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో వారే పెళ్లిచేసుకుని డీఎస్పీని ఆశ్రయించారు. తమతల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని కాపాడాలని కోరారు. ప్రస్తుతం వారి జంట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News October 7, 2024
జగన్‌ను CMను చేయడమే లక్ష్యం: కాకాణి
YCP అధినేత జగన్‌ను CMను చేయడమే తన లక్ష్యమని నెల్లూరు జిల్లా YCP అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ కోఆర్డినేటర్ ఆనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. కాకాణి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నేతలు పని చేయాలన్నారు. వారికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కాకాణి భరోసా ఇచ్చారు.
News October 7, 2024
కావలి: చికిత్స పొందుతూ ZPTC మృతి
గుడ్లూరు ZPTC సభ్యుడు కొరిసిపాడు బాపినీడు(56) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా కావలిలో నివాసం ఉంటున్న ఆయన గత ఎన్నికల్లో YCP తరఫున ZPTC సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇటీవలె రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగిన ఆయనకు అప్పుల బాధలు ఎక్కువ అయ్యాయి. దీంతో ఒత్తిడి పెరిగి పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిచంగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కావలి పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 6, 2024
కండలేరు జలాశయంలో మత్స్యకారుడు గల్లంతు
రాపూరు మండలం కండలేరు జలాశయం ఓబులాయపల్లి సమీపంలో చేపల వేటుకు వెళ్లిన చెంచయ్య అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేపలవేట సాగించి జీవనం సాగిస్తుంటాడు. చెంచయ్య ఆచూకీ కోసం కండలేరులో స్థానికులు గాలింపు వేగవంతం చేశారు.