News November 24, 2024
గూడూరు ‘నిమ్మ’ మార్కెట్లో టిక్కీ ఎంతంటే?

దేశంలో ప్రధానమైన గూడూరు మార్కెట్లో నిమ్మ ధరలు నిలకడగా సాగుతున్నాయి. ఆదివారం కిలో నిమ్మకాయలు రూ. 25 నుంచి 40 మధ్య ధరతో టిక్కీ రూ.2 వేలు పలికింది. తోటల్లో కాపు పెరగడంతో నిమ్మబస్తాలు అధికంగా వచ్చి చేరుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్తీక మాసం కావడంతో నిమ్మకాయల ధరలు ఆశాజనకంగా ఉన్నాయని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 5, 2025
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం అమ్మవారికి శ్రీ కాత్యాయని వ్రత మహోత్సవం వైభవంగా జరిగింది. అలాగే బుధవారం ఉదయం 10 గంటలకు ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి చెప్పారు. సాయంత్రం ఆలయ శిఖరంపై అఖండ కార్తీక దీపం వెలిగిస్తున్నామని చెప్పారు.
News November 4, 2025
తిరుపతిలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

తిరుపతి రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం నెల్లూరు స్టోన్ హౌస్ పేటకు చెందిన విద్యార్థి సాయి చందు(20) హాస్టల్ టెర్రస్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కోసం తండ్రికి ఫోన్ చేసిన కొన్ని గంటల్లోనే మృతి చెందాడు. ప్రేమ వ్యవహారం మృతికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
News November 4, 2025
అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా నీట్ విద్యార్థులకు ఉచిత శిక్షణ

విజయవాడలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా నీట్ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందజేయనున్నట్లు జిల్లా సంబంధిత శాఖ సమన్వయ అధికారిణి డాక్టర్ సి. ప్రభావతమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.


