News November 24, 2024
గూడూరు ‘నిమ్మ’ మార్కెట్లో టిక్కీ ఎంతంటే?
దేశంలో ప్రధానమైన గూడూరు మార్కెట్లో నిమ్మ ధరలు నిలకడగా సాగుతున్నాయి. ఆదివారం కిలో నిమ్మకాయలు రూ. 25 నుంచి 40 మధ్య ధరతో టిక్కీ రూ.2 వేలు పలికింది. తోటల్లో కాపు పెరగడంతో నిమ్మబస్తాలు అధికంగా వచ్చి చేరుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్తీక మాసం కావడంతో నిమ్మకాయల ధరలు ఆశాజనకంగా ఉన్నాయని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 12, 2024
తిరుపతి జిల్లా విద్యాసంస్థలకు నేడు సెలవు
భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ నేడు సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలతో పాటు వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లె మండలాలకు మాత్రమే సెలవు వర్తిస్తుంది. నెల్లూరు జిల్లాలో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
News December 12, 2024
అనంతసాగరం: తండ్రి, కుమారుల గొడవ.. కొడుకు మృతి
అనంతసాగరం మండలం ఇనగలూరులో తండ్రి-కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కొడుకు మృతి చెందాడు. కొడుకు మస్తాన్ రోజు మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడు. దీనితో తండ్రి నబ్బీసాహెబ్ మందలించాడు. ఈ క్రమంలో తండ్రి పై కర్రతో దాడి చేయబోయి పక్కనే ఉన్న రాళ్ల పై పడి కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మస్తాన్ మృతి చెందాడు.
News December 12, 2024
నెల్లూరు: సౌదీలో నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులకు సౌదీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు నెల్లూరు జిల్లా ఉపాధి అధికారి వినయ్ కుమార్ పేర్కొన్నారు. అభ్యర్థులు 18-40 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండి, ఏదైనా ఆస్పత్రిలో 18 నెలలు పని చేసిన అనుభవం ఉండాలన్నారు. ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి రూ.78- రూ.89 వేలు వేతనం లభిస్తుందన్నారు.