News April 25, 2024

గూడూరు: పెళ్లి కావడం లేదని యువకుడి సూసైడ్

image

పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గూడూరు మండలంలోని రాయవరంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రమేశ్(33) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా పెళ్లి కాలేదని మనోవేదనతో ఉన్నాడు. ఈ క్రమంలో మద్యంలో విషం కలుపుకొని తాగాడు. దీంతో అతడిని బందరు ఆస్పత్రి, అక్కడి నుంచి విజయవాడ తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు.

Similar News

News January 7, 2026

ఆత్కూరులో ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణ

image

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ట్యాలీ కోర్సులో శిక్షణ ప్రారంభం కానుంది. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతితో పాటు పౌష్టికాహారాన్ని ట్రస్టు నిర్వాహకులు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 6, 2026

ఎరువుల వినియోగంపై అవగాహన అవసరం: కలెక్టర్

image

ఆరోగ్యకరమైన పంటల సాగుకు రైతులు ఎరువులను విచక్షణతో వినియోగించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ డీ.కే. బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన ధర్తీ మాత బచావో నిగ్రాన సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు అనవసరంగా రసాయన ఎరువులు వాడకుండా నియంత్రించే బాధ్యత వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందని తెలిపారు.

News January 6, 2026

బండారు దత్తాత్రేయకు గన్నవరంలో ఘన స్వాగతం

image

హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర నేతలు కానూరి శేషు మాదవి, నాదెండ్ల మోహన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం బండారు దత్తాత్రేయ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.