News August 10, 2024
గూడూరు: బావ చేతిలో బామ్మర్ది హత్య

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు బనిగిసాహెబ్ పేటలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో బావ, బామ్మర్ది మధ్య ఏర్పడిన ఘర్షణలో.. బామ్మర్ది జాకీర్, ఆయన చెల్లెలిపై బావ అల్లాబక్షు రోకలి బండతో దాడి చేశాడు. ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా జాకీర్ మృతి చెందాడు. ఆయన చెల్లెలి పరిస్థితి విషయంగా ఉంది.
Similar News
News December 11, 2025
నెల్లూరు: శిక్షణ పూర్తయినా.. తప్పని నిరీక్షణ.?

మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం కుట్టు మిషన్ల శిక్షణ చేపట్టింది. 3 నెలల పాటు ఈ శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందిస్తామన్నారు. శిక్షణ పూర్తయి 3నెలలు అయినా మిషన్లు అందలేదు. మహిళలు 3 నెలల నుంచి కుట్టు మిషన్లు, ధ్రువ పత్రాలు కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 31 శిక్షణా కేంద్రాల్లో 1808 మందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి అయిన వారికి మిషన్లు అందించాలని మహిళలు కోరుతున్నారు.
News December 11, 2025
నెల్లూరు కలెక్టర్కు 2వ ర్యాంకు

నెల్లూరు కలెక్టర్గా హిమాన్షు శుక్లా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ పాలన చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆయన 682 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 628 క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్ను 17 గంటల వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆయనను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. దీంతో ఫైల్ క్లియరెన్స్లో మన కలెక్టర్కు సీఎం రాష్ట్రంలోనే 2వ ర్యాంకు ఇచ్చారు.
News December 11, 2025
నెల్లూరు: నేరాల నియంత్రణకు స్పెషల్ టాస్క్ఫోర్స్

నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణకు స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వెల్లడించారు. ప్రతి బృందానికి SI స్థాయి అధికారి ఇన్ఛార్జ్గా ఉంటారని చెప్పారు. జిల్లాలో 6 స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీసు వ్యవస్థను మరింత చురుగ్గా, సమయస్ఫూర్తితో సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.


