News March 28, 2024

గూడూరు: రైలు కిందపడి ఆత్మహత్య?

image

నాయుడుపేట-పెద్దపరియ రైల్వే స్టేషన్ల మధ్య గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి చనిపోవడాన్ని గూడూరు రైల్వే పోలీసులు గుర్తించారు. రైల్వే ఎస్ఐ కొండప్ప నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 35 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి రైలు వస్తుండగా పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. మృతుడు గళ్ల లుంగి, ఫుల్ హ్యాండ్ షర్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని గూడూరు ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 5, 2025

నెల్లూరు: 2.94 లక్షల చిన్నారులకు పోలియో చుక్కలే లక్ష్యం.!

image

నెల్లూరు జిల్లాలో ఈనెల 21వ తేదీన పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు ఉన్న 2,94,140 మంది చిన్నారులకు ఈ చుక్కల మందును వేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సన్నద్ధం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 52 PHC, 28 UPHCల పరిధిలో 80 కేంద్రాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించారు.

News December 5, 2025

అటు వెళ్లకండి.. నెల్లూరు జిల్లా వాసులకు అలర్ట్.!

image

నెల్లూరు జిల్లాలోని అన్నీ చెరువులు, రిజర్వాయర్లు, దిత్వా తుఫాను ప్రభావంతో నిండుకుండల్లా ఉన్నాయి. దీంతో పలుచోట్ల పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు రెవెన్యూ సిబ్బంది ప్రజలను చెరువులవద్దకు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో నీటి ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వరద ప్రాంతాల్లో ప్రజలు మోహరించకుండా బారికేడ్లు, పెట్రోలింగ్ వాహనాల ద్వారా గస్తీ కాస్తున్నారు.

News December 5, 2025

నెల్లూరు: భారీ వర్షాలకు ఒకరు మృతి.. మరొకరు గల్లంతు..

image

నెల్లూరు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. నెల్లూరు పొర్లుకట్ట ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థి మస్తాన్ గురువారం పొట్టెపాలెం కలుజులో పడి మృతి చెందాడు. నెల్లూరు శివారు ప్రాంతం కొండ్లపూడికి చెందిన రవికుమార్ బుధవారం సాయంత్రం నెల్లూరు కాలువలో గల్లంతయ్యారని సమాచారం. తండ్రి గల్లంతైనట్లు రవికుమార్ కుమార్తె కావ్య గురువారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.