News March 28, 2024
గూడూరు: లారీ, బైక్ ఢీ.. ఇద్దరు మృతి

లారీ, బైక్ ఢీకొని ఇద్దరు మృతిచెందిన సంఘటన గూడూరు మండలం మాచర్ల గ్రామసమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ వైపు వెళ్తున్న బైక్‌కు వెనుకాల నుంచి అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 18, 2025
వరంగల్: ‘స్థానిక పోరు’పై మళ్లీ మొదలైన ఆసక్తి

స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గ్రామాల్లో మళ్లీ ఎన్నిక కోలాహలం అంతర్గతంగా మొదలైంది. వరంగల్ జిల్లాలో ఆశావహులు ఎన్నికల్లో పోటీపై మరోసారి చర్చలు ప్రారంభించారు. రిజర్వేషన్లు మారనున్న నేపథ్యంలో పోటీ చేయాలా..? వద్దా..? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఎన్నికల హడావుడి తిరిగి మొదలైంది. వరంగల్ జిల్లాలో 317 పంచాయతీలు, 130 MPTC, 11 ZPTC స్థానాలున్నాయి.

News November 17, 2025
వరంగల్: ‘గురుకుల పాఠశాల కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి’

వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలకు భోజన సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్టర్లు, తమ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన మార్కెట్ ధరలను దృష్టిలో పెట్టుకొని రేట్లను సవరించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారానికి వినతిపత్రం అందజేశారు. గత నాలుగు నెలలుగా బిల్లులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరావు తెలిపారు.