News September 8, 2024

గూడూరు వైసీపీ నేతకు షాక్..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కనుమూరు రవిచంద్రారెడ్డి అధికార ప్రతినిధిగా పలు టీవీ డిబేట్లలో YCP వాయిస్ వినిపించారు. MLAలు, MPలతో పాటు కొందరు నేతలతో టీవీ డిబేట్లలో పాల్గొనే వాళ్ల లిస్ట్‌ను YCP తాజాగా విడుదల చేసింది. వీళ్లను తప్ప మిగిలిన వాళ్లను డిబేట్లకు పిలవకూడదని.. వాళ్ల కామెంట్స్‌కు పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ జాబితాలో రవిచంద్రా రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Similar News

News December 16, 2025

ఇంకా గోవాలోనే కార్పొరేటర్లు, 18న నెల్లూరుకు రాక

image

నెల్లూరు కార్పొరేషన్లోని కార్పొరేటర్లు అందరూ ఇంకా గోవాలోనే ఉన్నారు. ఆదివారం రాత్రి 38 మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు గోవాకు వెళ్లారు. తిరిగి 17వ తేదీ తిరుపతికి వస్తారు. అక్కడి నుంచి 18వ తేదీ ఉదయానికి కౌన్సిల్ సాధారణ సమావేశానికి హాజరవుతారు. అవిశ్వాస తీర్మానం లేకపోవడంతో సాధారణ సమావేశం జరగనుంది.

News December 16, 2025

నెల్లూరు: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి నెల్లూరు విజయమహల్ వద్ద జరిగింది. విజయవాడ వైపు వెళ్లే గుర్తు తెలియని రైలులో నుంచి గుర్తు తెలియని వ్యక్తి జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందినట్లు నెల్లూరు రైల్వే SI హరిచందన తెలిపారు. అతడు ఎరుపు రంగు ఆఫ్ హాండ్స్ టీ షర్టు, సిమెంట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని, వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుందన్నారు.

News December 15, 2025

ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించండి: సుభాష్

image

రాష్ట్రంలోని బీసీ ప్రభుత్వ హాస్టళ్లలో ఉన్న తీవ్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దులూరు సుభాష్ యాదవ్ కోరారు. ఈమేరకు విజయవాడలో బీసీ సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ చంద్రశేఖర్ రాజుకి వినతిపత్రం సమర్పించారు. భవనాల దుస్థితి, నాసిరక ఆహారం, వార్డెన్ల కొరత, స్కాలర్‌షిప్‌ల ఆలస్యం, గర్ల్స్ హాస్టళ్లలో భద్రతా లోపం వంటి అనేక సమస్యలు ఉన్నాయని, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.