News November 28, 2024
గూడూరు సమీపంలో రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్
చిల్లకూరు(మం) కడివేడు సమీపంలో బుధవారం రాత్రి ఓ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. చిల్లకూరు ఎస్‌ఐ సురేశ్ రెడ్డి వివరాల ప్రకారం.. కడివేడు వద్ద బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో బైక్ వెనుక కూర్చున్న కడివేడు గ్రామానికి చెందిన మాధవ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 3, 2024
పీఎస్ఎల్వీ సీ -59 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోట షార్ నుంచి ఈనెల 4వ తేదీన పీఎస్ఎల్వీ సీ – 59రాకెట్ ను ప్రయోగించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.38గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించనున్నట్లు శాస్రతవేత్తలు తెలియజేశారు. కౌంట్ డౌన్ కొనసాగిన తరువాత 4వ తేదీన సాయంత్రం 4.08 గంటలకు ప్రయోగించనున్నారు. సోమవారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించారు. మొదటి ప్రయోగ వేదికలో అనుసంధాన పనులు జరుగుతున్నాయి.
News December 2, 2024
రేపు సూళ్లూరుపేటకు జిల్లా కలెక్టర్ రాక
ఉమ్మడి నెల్లూరు జిల్లా,సూళ్లూరుపేటలో రేపు ఉదయం ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన హాజరై ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News December 1, 2024
కొండాపురం: హత్య చేసిన నిందితుడు అరెస్ట్
కొండాపురం మండలం గానుగపెంటలో బంకా తిరుపాలు అనే మేకల కాపరిని హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ శ్రీధర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. గానుగపెంటలో బుధవారం బాంకా తిరుపాలు హత్యకు గురయ్యాడు. పశువులు కాస్తున్న మాల్యాద్రి(మల్లి) ఈ హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. తిరుపాలుకు చెందిన మేకలను అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని ఆశతోనే ఈ హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు.