News January 31, 2025
గూడూరు: సారీ.. చైతూ బావ అంటూ సూసైడ్

‘చైతూ బావ.. నా కోసం ఏదైనా చేస్తాను అన్నావుగా.. నీకు పుట్టే బిడ్డకు నా పేరు పెట్టు.. నాకు మీరు చూడగానే నచ్చారు. కానీ నా జ్ఞాపకాలు మీతో విడిచి వెళ్లిపోతున్నా.. సారీ..’ అని రాసి ఓ యువతి సూసైడ్ చేసుకుంది. డిసెంబర్ 14న నిశ్చితార్థం కాగా..ఇవాళ బంధువుల అబ్బాయితో పెళ్లి జరగాల్సి ఉంది. ఏం జరిగిందో తెలియదు గానీ గూడూరు సమీపంలోని పంపలేరులో నిన్న మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News November 1, 2025
107 ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP: విజయవాడలో ఉన్న ఆయుష్ విభాగంలో 107 ఉద్యోగాల భర్తీకి APMSRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ రిక్రూట్మెంట్ జరగనుంది. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంకామ్, MBA, CA, ICWA, MD, BAMS, BHMS, BUMS, BNYS పాసవ్వడంతోపాటు APMCలో రిజిస్ట్రేషన్ ఉండాలి. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఈ నెల 15 వరకు అప్లై చేసుకోవచ్చు.
వెబ్సైట్: https://apmsrb.ap.gov.in/msrb/
News November 1, 2025
విశాఖలో ప్రాంతాల బట్టి స్పీడ్ లిమిట్స్

విశాఖలో ప్రయాణ సమయం ఆదా చేయడం, రోడ్డు భద్రత మెరుగుపరచడమే లక్ష్యంగా సీపీ శంకబ్రత బాగ్చి కొత్త స్పీడ్ లిమిట్స్ ప్రకటించారు. NH-16లో మర్రిపాలెం-కూర్మన్నపాలెం 50 kmph, కూర్మన్నపాలెం-కొమ్మాది 40 kmph, కొమ్మాది-రాజులపాలెం 50 kmph, ఆనందపురం-పినగాడి బైపాస్ 60 kmph, NH-26లో 60 kmph, బీచ్ రోడ్ & ఇతర జీవీఎంసీ రోడ్లలో 40 kmph, పెందుర్తి-బాజీ జంక్షన్ వరకు 50 kmphగా నిర్ణయించారు. >Share it
News November 1, 2025
సిద్దిపేట: రైతులకు ఆదుకుంటాం: మంత్రి

వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎవరూ అధైర్య పడరాదని మంత్రిం పొన్నం ప్రభాకర్ తెలిపారు. అక్టోబర్ 29న ఇంతకుముందెన్నడూ లేని విధంగా జిల్లాలో కురిసిన వర్షానికి ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నీటిలో కొట్టుకుపోయిందని అన్నారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.


