News January 31, 2025
గూడూరు: సారీ.. చైతూ బావ అంటూ సూసైడ్

‘చైతూ బావ.. నా కోసం ఏదైనా చేస్తాను అన్నావుగా.. నీకు పుట్టే బిడ్డకు నా పేరు పెట్టు.. నాకు మీరు చూడగానే నచ్చారు. కానీ నా జ్ఞాపకాలు మీతో విడిచి వెళ్లిపోతున్నా.. సారీ..’ అని రాసి ఓ యువతి సూసైడ్ చేసుకుంది. డిసెంబర్ 14న నిశ్చితార్థం కాగా..ఇవాళ బంధువుల అబ్బాయితో పెళ్లి జరగాల్సి ఉంది. ఏం జరిగిందో తెలియదు గానీ గూడూరు సమీపంలోని పంపలేరులో నిన్న మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News February 15, 2025
నెల్లూరు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. ఉపాధ్యాయుడిపై కేసు

పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకులైన ఉపాధ్యాయుడిపై నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని తోటి విద్యార్థులు ముందు టీచర్ హేళనగా మాట్లాడటంతో మనస్తాపం చెంది హాస్టల్ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేసి ఉపాధ్యాయుడు వీర రాఘవులుపై కేసు నమోదు చేశారు.
News February 15, 2025
దుర్గి: దాడి కేసులో నిందితుడి అరెస్టు

వ్యక్తిపై దాడి కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ సుధీర్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. దుర్గి మండలం తేరాలకు చెందిన వీరయ్యపై 2000 సంవత్సరంలో శీలం సిద్ధయ్య, వెంకటేశ్వర్లు దాడి చేసి గాయపరిచారన్నారు. ఆ సమయంలో సిద్ధయ్య, వెంకటేశ్వర్లుపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. కేసు విచారణలో ఉండగా సిద్ధయ్య కోర్టుకు హాజరుకాకుండా పారిపోయాడన్నారు.
News February 15, 2025
పరిగెలను పదవి నుంచి తప్పించిన షర్మిల

కర్నూలు డీసీసీ అధ్యక్షుడు పరిగెల మురళీకృష్ణను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పదవి నుంచి తప్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మురళీకృష్ణ డీసీసీ ఆస్తులను సొంత ఆస్తులుగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి, అక్రమాలకు పాల్పడినట్లు ఇటీవల ఏపీసీసీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై ప్రాథమిక విచారణ అనంతరం ఆయనను పదవి నుంచి తప్పించారు.