News February 4, 2025
గూడూరు: హైవేపై ప్రమాదం..15 మందికి గాయాలు

చిల్లకూరు మండలంలోని బూధనం టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్‌కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సును నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. ఘటనా స్థలానికి చిల్లకూరు పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 18, 2025
గుంటూరులో పడిపోయిన చికెన్ ధరలు

బర్డ్ ఫ్లూ ప్రభావంతో గుంటూరు నగరంలో కూడా చికెన్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజుల క్రితం ఇతర జిల్లాలతో పోల్చుకుంటే గుంటూరు నగరంలో రూ.25 ఎక్కువగా విక్రయించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రజలు మటన్, చేపల కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటంతో చికెన్ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో గుంటూరు చికెన్ వ్యాపార దుకాణాల సంఘ సభ్యులు కేజీ రూ. 100కి విక్రయించాలని నిర్ణయించారు.
News February 18, 2025
ఎలమంచిలిలో జిల్లా హాకీ జట్టు ఎంపిక పోటీలు

ఎలమంచిలి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఈనెల 20వ తేదీన జిల్లా హాకీ జట్టు సీనియర్ పురుషుల టీమ్‌ను ఎంపిక చేసేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి కొఠారి నరేశ్ మంగళవారం తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎంపిక పోటీలు జరుగుతాయని అన్నారు. ఎంపికైన వారు వచ్చే నెల గుంటూరులో జరిగే పోటీలో పాల్గొంటారని అన్నారు.
News February 18, 2025
నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నర్సంపేట -పాకాల మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగి యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. అశోక్ నగర్‌కు చెందిన వెంకటేశ్ నర్సంపేటలో షాపులో పని చేస్తుండేవాడు. సోమవారం రాత్రి పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళుతున్న క్రమంలో ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.