News April 16, 2025

గూడెంకొత్తవీధి: RTC బస్సు‌కు తప్పిన ప్రమాదం

image

గూడెం కొత్తవీధి మండలం ధారకొండ – గుమ్మిరేవుల ఘాట్ రోడ్డులో మంగళవారం ప్రయాణికులతో వెళుతున్న బస్సుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడ 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఏత్తయిన కొండలపై కురిసిన వాన నీరు మాదిమళ్ళ గెడ్డకు పోటెత్తి వంతెన వద్ద ఉద్ధృతంగా ప్రవహించింది. అదే సమయంలో నర్సీపట్నం- గుమ్మిరేవుల బస్సు రోడ్ అప్రోచ్ ఎక్కుతూ బురదలో జారుకుంటూ వెనక్కు వచ్చేసింది. డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది.

Similar News

News November 6, 2025

నేడు స్పీకర్ వద్ద విచారణకు భద్రాచలం MLA

image

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. BRSలో గెలిచి అధికార కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు సంబంధించి అనర్హత పిటిషన్‌పై విచారణ నేడు జరగనుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ ఏడాది ఆగస్టు 23న దీనికి సంబంధించిన నోటీసులు జారీ చేశారు. నేడు(గురువారం) జరగబోయే విచారణతో ఎమ్మెల్యే వెంకటరావు రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందోనని జిల్లాలో చర్చ మొదలైంది.

News November 6, 2025

KNR: ‘పైసలిస్తేనే పని’.. కార్మిక శాఖలో ఓపెన్ దందా..!

image

కార్మిక శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. దళారులు, అధికారులు కలిసి సామాన్యుడిని దోచుకుంటున్నారు. డెత్ క్లైమ్‌కు రూ.50,000, పెళ్లికి రూ.10,000 ముందు చెల్లిస్తేనే ఖాతాల్లో డబ్బు జమవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ఇందుకు ఏజెంట్లు, బ్రోకర్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి KNR కార్మిక శాఖలో లేబర్ కార్డ్ నమోదు నుంచి వివాహకానుకలు, అంగవైకల్యం, డెత్ క్లైమ్ల వరకు ప్రతిపనికి ఓ RATE ఫిక్స్ అయ్యుంది.

News November 6, 2025

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: టిప్పర్ యజమాని

image

మీర్జాగూడ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని <<18186628>>టిప్పర్<<>> యజమాని లక్ష్మణ్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బస్సు డ్రైవర్ వేగంగా వస్తూ గుంతను తప్పించబోయి మాపైకి దూసుకొచ్చాడు. వెంటనే డ్రైవర్ ఆకాశ్ నన్ను నిద్రలో నుంచి లేపాడు. క్షణాల్లోనే బస్సు మా టిప్పర్‌ను ఢీకొట్టింది. మా డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపాడని, గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టాడని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు’ అని తెలిపారు.