News March 12, 2025
గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సాయం: కలెక్టర్

విశాఖ జిల్లాలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు బుధవారం కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. ఇళ్లు మంజూరై ఇంకా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ఇళ్లకు సాయం అందిస్తామన్నారు. యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీలకు రూ.50 వేలు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు 75 వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 20, 2025
దొంగగా మారిన బ్యాంకు ఉద్యోగి

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో బ్యాంకు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. అతని నుంచి 2 గన్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాజులూరులో దొంగతనం కేసులో అతనిని అరెస్టు చేయగా పలు విషయాలు బయటపడ్డాయి. నాగేశ్వరరావు గతంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌లో పనిచేస్తూ 900 గ్రాముల బంగారం అవకతవకలు చేయడంతో తొలగించినట్లు తెలిపారు.
News March 20, 2025
విశాఖ నుంచి వెళ్లే రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు

సామర్లకోట-రావికంపాడు మధ్యన ఆటో మేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా సింహాద్రి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 23,24 తేదీల్లో గుంటూరు – విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్ అదే విధంగా విశాఖ – గుంటూరు సింహాద్రి, 24న ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను రెండు వైపులా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
News March 20, 2025
సంచిలో ట్రాన్స్‌జెండర్ తల, చేయి లభ్యం

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ హత్య కలకలం రేపింది. కశింకోట మండలం బయ్యవరంలో హంతకుడు ఆమె నడుము కింది భాగం, కాలు, చేయి మూట కట్టి పడేశాడు. దీంతో జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్ 8 టీమ్‌లతో దర్యాప్తు చేపట్టి చనిపోయింది దీపుగా గుర్తించారు. అయితే ఆమె తల, మరో చేయి అనకాపల్లి వై జంక్షన్ వద్ద సంచిలో దొరికాయి.