News December 5, 2024

గృహ నిర్మాణ శాఖ అధికారులు బాధ్యతగా పని చేయాలి: కలెక్టర్

image

గృహ నిర్మాణ రంగంలో పనిచేసే అధికారులు బాధ్యతగా పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 72,353 ఇల్లు మంజూరు కాగా కేవలం 22,500 పూర్తి చేశారని తెలిపారు. మిగిలిన వారిని మార్చి చివరకు పూర్తి చేసే విధంగా పని చేయాలని ఆదేశించారు.

Similar News

News January 19, 2025

కదిరి నరసింహ సామి సాచ్చిగా..

image

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. ‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా!’ అంటూ కొత్త ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ‘VT 15’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఫిల్మ్’గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

News January 19, 2025

పద్యాలతో జ్ఞానజ్యోతిని వెలిగించిన లోకకవి వేమన: JNTU ఇన్‌ఛార్జ్ వీసీ

image

అనంతపురం JNTUలోని పరిపాలన భవనంలో ఆదివారం యోగి వేమన జయంతిని పురస్కరించుకొని JNTU ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శనరావు, రిజిస్ట్రార్ కృష్ణయ్యతో కలిసి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇన్‌ఛార్జ్ వీసీ మాట్లాడుతూ.. ఎంతో అద్భుతమైన పద్యాలతో ప్రపంచానికి జ్ఞానజ్యోతిని వెలిగించిన లోకకవి వేమన అని కొనియాడారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ వీసీతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

News January 19, 2025

అనంత: మాజీ ఎమ్యెల్యే సోదరుడిపై కేసు నమోదు

image

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిపై శనివారం టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముత్యాలు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 2022 సంవత్సరంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌లపై అసభ్య పదజాలంతో దూషించడంతో కేసు నమోదు చేసినట్లు రాప్తాడు సీఐ శ్రీహర్ష వెల్లడించారు.