News April 10, 2025
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి: ఎస్పీ

గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎస్పీ దామోదర్ చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని భీమ్ సేవా సమితి, భీమ్ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహిస్తున్న జిల్లా స్ధాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు ఇచ్చే ట్రోఫీలను గురువారం ఎస్పీ ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్లో 40 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ఎస్పీ కొంచెంసేపు క్రికెట్ ఆడారు.
Similar News
News September 14, 2025
కందుకూరు: కరేడులో టెన్షన్..టెన్షన్..

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు (M) కరేడులో ఆదివారం అంతటా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆంక్షల నడుమ బోడె రామచంద్ర యాదవ్ మీటింగ్ జరగాల్సి ఉండటంతో పరిణామాలు ఎలా దారి తీస్తాయో అన్న టెన్షన్ అందరిలో ఏర్పడింది. జూలై 29న జరిగిన హైవే దిగ్బంధం కార్యక్రమంలో కూడా బోడె రామచంద్ర వెంట అనూహ్యంగా వేలాది మంది కరేడు ప్రజలు దూసుకొచ్చిన ఘటన తెలిసిందే. ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.
News September 14, 2025
ప్రకాశం నూతన ఎస్పీ.. తిరుపతిలో ఏం చేశారంటే?

ప్రకాశం జిల్లా నూతన SPగా హర్షవర్ధన్ రాజు నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తిరుపతి SPగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. TTD CVSOగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. తిరుపతి SPగా విధుల సమయంలో రాత్రి వేళ నైట్ విజన్ డ్రోన్లు రంగంలోకి దించి గంజా బ్యాచ్ అంతు చేశారు. తిరుపతి హోమ్ స్టేల కోసం నూతన యాప్ ప్రవేశపెట్టి తన మార్క్ చూపించారు. ఈయన తిరుపతికి ముందు కడప జిల్లాలో ఎస్పీగా పనిచేశారు.
News September 14, 2025
ప్రకాశం లోక్ అదాలత్లో 6558 క్రిమినల్ కేసులు పరిష్కారం

ప్రకాశం జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి తెలిపిన వివరాల ప్రకారం.. అన్ని న్యాయస్థానాలలో లోక్ అదాలత్ జరిగింది. ఈ కార్యక్రమంలో 167 సివిల్ కేసులు, 6558 క్రిమినల్ వ్యాజ్యాలు, ప్రీ లిటిగేషన్ స్థాయిలో 4 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.