News April 6, 2025
గెస్ట్ హౌస్ నుంచి మిథిలా స్టేడియానికి సీఎం

బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడి నుంచి భద్రాచల సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావుతో కలిసి మిథిలా స్టేడియానికి వెళ్లారు.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
OU: ఈ నెల 22 నుంచి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET) పరీక్షలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ బి.శ్రీనివాస్ తెలిపారు. 3 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఈ విషయం గమనించాలని శ్రీనివాస్ కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు ఈ సెట్ నిర్వహిస్తారు.
News December 5, 2025
ప్రపంచ వేదికపై మరోసారి మెరిసిన ఓరుగల్లు అర్జున్

ఇజ్రాయిల్‌లో జరిగిన జెరూసలెం మాస్టర్స్ 2025 చెస్ ఫైనల్లో ఓరుగల్లు జీఎం ఇరిగేసి అర్జున్ మరో సారి తన ప్రతిభను చాటుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్‌తో ర్యాపిడ్ మ్యాచ్‌లు డ్రాగా ముగియగా, టైబ్రేక్ బ్లిట్జ్‌లో 2.5-1.5 తేడాతో విజయం సాధించి టైటిల్ దక్కించుకున్నాడు. టైటిల్‌తో పాటు 55,000 డాలర్లు అందుకున్న అర్జున్, చిన్ననాటి నుంచే చెస్‌లో ప్రతిభ చూపి 14 ఏళ్లకే జీఎం హోదా సాధించాడు.


