News March 20, 2025
గేట్లో సత్తా చాటిన సారపాక విద్యార్థి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలానికి చెందిన పంపన రమేశ్ కుమారుడు చరణ్ తేజ బుధవారం విడుదలైన గేట్ ఫలితాల్లో 1060వ ర్యాంకు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. తాము పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ర్యాంక్ సాధించాడని తల్లిదండ్రులు చెప్పారు. ఈ ఘనత సాధించిన విద్యార్థి చరణ్ తేజకు స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News December 10, 2025
18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఓకే: గద్వాల కలెక్టర్

గద్వాల జిల్లాలో ఈనెల 11, 14, 17 తేదీల్లో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 రకాల గుర్తింపు కార్డులను పరిగణనలోకి తీసుకుంటామని గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, ఉపాధి హామీ జాబ్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఫోటోతో కూడిన కుల ధ్రువీకరణ పత్రాలు, పాస్ పోర్ట్, దివ్యాంగుల గుర్తింపు కార్డ్ మ తదితర వాటిని చూయించి ఓటు వేయవచ్చని తెలిపారు.
News December 10, 2025
MBNR: అతిథి అధ్యాపక పోస్టుకు నోటిఫికేషన్

మహబూబ్నగర్ ప్రభుత్వ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టు బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు డా.కె.పద్మావతి తెలిపారు. సంబంధించిన పీజీలో 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులు, పీహెచ్డీ, నెట్, సెట్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తులను ఈనెల 11 నుంచి 12 వరకు అందజేయాలని తెలిపారు.
News December 10, 2025
వనపర్తి: ‘మూడు నెలల జీతాలు పెండింగ్’

3నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లు DM&HO డా.సాయినాథ్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. జీవో 1195 ప్రకారం ప్రతి ఉద్యోగికి రూ.19,500 చెల్లించాలని, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 11 నుంచి 19ఆన్లైన్ వర్క్ బంద్ చేస్తున్నట్లు, 19లోపు వేతనాలు ఇవ్వని పక్షంలో 20 నుంచి నిరవధిక సమ్మే చేస్తామన్నారు.


