News January 10, 2025
‘గేమ్ ఛేంజర్’లో విజయనగరం కలెక్టర్‌గా బ్రహ్మానందం..!

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఉత్తరాంధ్ర ప్రేక్షకులకు స్పెషల్ అనుభూతిని పంచింది. రామ్ చరణ్ విశాఖ కలెక్టర్‌గా.. బ్రహ్మానందం విజయనగరం కలెక్టర్‌గా పనిచేశారు. విశాఖ యూనివర్సిటీ పేరుతో ఉన్న భవనంలో పలు ఫైట్ సీన్లు ఉన్నాయి. షూటింగ్ టైంలో పబ్లిక్ మీటింగ్ కోసం R.K బీచ్‌లో పెద్ద సెట్ వేశారు. బీచ్ రోడ్డు NTR బొమ్మ దగ్గర సాంగ్ షూట్ చేశారు. కొన్ని క్యారెక్టర్ల పేర్లు కూడా మన ఉత్తరాంధ్ర యాసలోనే ఉన్నాయి.
Similar News
News November 24, 2025
అత్యాచారం కేసులో వ్యక్తికి 12 ఏళ్ల జైలు: SP

2019లో గరివిడిలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన బొండపల్లికి చెందిన సవిరిగాన సూర్యనారాయణకు విజయనగరం మహిళా కోర్టు 12 ఏళ్ల కఠిన కారాగార, శిక్ష రూ.2వేల జరిమానా విధించిందని ఎస్పీ దామోదర్ ఇవాళ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేశారన్నారు. PP సత్యం వాదనలతో నిందితుడిపై నేరం రుజువైందన్నారు. దర్యాప్తు చేసిన అధికారులను ఎస్పీ అభినందించారు.
News November 24, 2025
రాజాం: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన రాజాం సారధి రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రాజాంలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న ఉర్లాపు సావిత్రి (30) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సావిత్రి ఉరి వేసుకుని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి భర్త, కొడుకు, కుమర్తె ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
News November 24, 2025
డిసెంబర్ 5న APNGGO కొత్తవలస యూనిట్ ఎన్నికలు

కొత్తవలసలోని APNGGO యూనిట్ ఎన్నిక డిసెంబర్ 5 న నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు K.ఆదిలక్ష్మి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సహాయ ఎన్నికల అధికారిగా యెర్రా రమణ, ఎన్నికల పరిశీలకులుగా ఆనంద్ కుమార్ వ్యవహరిస్తారన్నారు. ఈనెల 28న నామినేషన్ వేయాలని, కొత్తవలస, వేపాడ ఎల్కోటలో ఉన్న ఉద్యోగస్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.


