News January 10, 2025
‘గేమ్ ఛేంజర్’లో విశాఖ కలెక్టర్గా రామ్ చరణ్..!

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ వైజాగ్ ప్రేక్షకులకు స్పెషల్ అనుభూతిని పంచింది. రామ్ చరణ్ విశాఖ కలెక్టర్గా.. బ్రహ్మానందం విజయనగరం కలెక్టర్గా పనిచేశారు. విశాఖ యూనివర్సిటీ పేరుతో ఉన్న భవనంలో పలు ఫైట్ సీన్లు ఉన్నాయి. షూటింగ్ టైంలో పబ్లిక్ మీటింగ్ కోసం R.K బీచ్లో పెద్ద సెట్ వేశారు. బీచ్ రోడ్డు NTR బొమ్మ దగ్గర సాంగ్ షూట్ చేశారు. కొన్ని క్యారెక్టర్ల పేర్లు కూడా మన ఉత్తరాంధ్ర యాసలోనే ఉన్నాయి.
Similar News
News December 9, 2025
విశాఖలో టెట్ పరీక్షలు.. అభ్యర్థులకు డీఈవో కీలక సూచనలు

విశాఖ జిల్లాలో AP TET-2025 పరీక్షలు డిసెంబర్ 10 నుంచి 21 వరకు 12 కేంద్రాల్లో ఆన్లైన్ (CBT) విధానంలో జరగనున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్పక తీసుకురావాలని, పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందే సెంటర్కు చేరుకోవాలని ఆయన సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని స్పష్టం చేశారు.
News December 9, 2025
విశాఖ: పలు రైళ్లు రద్దు.. మరికొన్ని కుదింపు

భద్రతా పనుల కారణంగా కేకే లైన్లో పలు రైళ్లను నియంత్రిస్తున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం పవన్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 9, 10వ తేదీల్లో విశాఖ-కిరండూల్, హీరాఖండ్, రూర్కెలా ఎక్స్ప్రెస్ కోరాపుట్ లేదా దంతెవాడ వరకే నడుస్తాయి. అదేవిధంగా డిసెంబర్ 13, 15వ తేదీల్లో విశాఖ-కిరండూల్ పాసింజర్ రైలు విశాఖపట్నం-కోరాపుట్ మధ్య రద్దు చేయబడింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలి.
News December 9, 2025
విద్యార్థుల్లో నైపుణ్యాల కోసమే బాలోత్సవాలు: విశాఖ DEO

విశాఖ బాలోత్సవం సెయింట్ ఆంథోనీ స్కూల్లో ఘనంగా ప్రారంభమైంది. జిల్లా విద్యాధికారి ఎన్.ప్రేమ్ కుమార్ దీనిని ప్రారంభించగా.. రోటరీ గవర్నర్ డా.వై.కళ్యాణ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో మంచి మార్పు వస్తుందని వక్తలు పేర్కొన్నారు. మొదటి రోజు వివిధ విభాగాల్లో 27 అంశాలపై పోటీలు నిర్వహించారు.


