News January 31, 2025
గొంగడి త్రిష సూపర్ ఫామ్ కంటిన్యూ

భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష అండర్ -19 టీ20 ప్రపంచ్ కప్‌లో సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులతో రాణించి గెలుపులో కీలకంగా మారింది. కాగా ఇటీవల స్కాట్లాండ్‌తో జరిగిన టీ20ల్లోనే తొలి సెంచరీతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఫైనల్‌లోనూ ఉత్తమ క్రీడా ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Similar News
News February 14, 2025
ఏపీలో జీబీఎస్ కేసులు.. ప్రభుత్వం అలర్ట్

APలో జీబీఎస్ (గిలియన్ బారే సిండ్రోమ్) వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. గుంటూరు జీజీహెచ్‌లోనే ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆస్పత్రిని సందర్శించారు. జీబీఎస్ బాధితులు ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన పేర్కొన్నారు. ఈ వైరస్‌కు పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని సూచించారు.
News February 14, 2025
విధి నిర్వహణలో ఆయుధ పరిజ్ఞానం అవసరం: సీపీ

పోలీస్ విధుల నిర్వహణలో శాంతిభద్రతల రక్షణ, సాంకేతికతతో పాటు ఆయుధ పరిజ్ఞానం అవసరమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైరింగ్ ప్రాక్టీస్ రేంజిలో సీపీ పాల్గొని ఫైరింగ్ విధానాన్ని పరిశీలించారు. సమీపం నుంచి ప్రత్యర్థిని ఎదుర్కోవడం, ముష్కరులను నిరాయుధులను చేయడం, వ్యూహంగా మారి తలపడడం వంటి అంశాలపై ఆమె అవగాహన కల్పించారు.
News February 14, 2025
చిన్న క్రాకలో ఎమ్మెల్యే కాకర్ల ఫ్లెక్సీ చించివేత

జలదంకి మండలం చిన్న క్రాకలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి చించివేశారు. చిన్న క్రాకలో ఓ చెరువు వద్ద ఒక వర్గం ఎమ్మెల్యే ఆయన సోదరుడు ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలు చించివేయడంతో రాజకీయంగా దుమారం లేపింది.