News January 28, 2025

గొంగడి త్రిష సెంచరీ.. మంత్రి రాజనర్సింహ అభినందనలు

image

ఉమెన్స్ U-19 క్రికెట్ కప్ చరిత్రలో మొట్టమొదటి సెంచరీని నమోదు చేసిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ఆమె మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలని, అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడల్లో రాణించాలని అనుకుంటున్న ఎంతోమంది ఆడబిడ్డలకు త్రిష ప్రదర్శన స్పూర్తిగా నిలుస్తుందని ట్వీట్ చేశారు.

Similar News

News November 16, 2025

పార్వతీపురం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల అహ్వానం

image

సివిల్స్‌లో ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా బీసీ సంక్షేమ, సాధికారిత అధికారి అప్పన్న శనివారం తెలిపారు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు.అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి దరఖాస్తును పార్వతీపురంలోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయానికి నవంబర్ 25లోగా సమర్పించాలన్నారు.

News November 16, 2025

పెదఅమీరం: తొలి జీతం.. గ్రామదేవతకు అందజేత

image

కాళ్ల మండలం పెదఅమిరం గ్రామ దేవత శ్రీ పల్లాలమ్మ దేవాలయ అభివృద్ధికి ఉపాధ్యాయుడు బూరాడ వెంకటకృష్ణ శనివారం తన మొదటి జీతాన్ని అందజేశారు. మెగాడీఎస్సీ 2025 లో స్కూల్ అసిస్టెంట్(మాథ్స్) ఉద్యోగం సాధించిన వెంకటకృష్ణ తన తొలి జీతం మొత్తం రూ.50,099 లను ఆలయ అభివృద్ధి కమిటీ పెద్ద కోరా రామ్మూర్తికి అందజేశారు. ఆయనను పలువురు అభినందించారు.

News November 16, 2025

కామారెడ్డి: కన్న ఊరును వీడిన ‘బతుకు బండి’

image

చెరుకు సీజన్ షురూ కావడంతో గిరిజన ప్రాంతాల నుంచి వలసలు మొదలయ్యాయి. ప్రతి ఏటా మాదిరిగానే, ఈ ఏడాది కూడా సంగారెడ్డి జిల్లాకు చెందిన గిరిజనులు ఉపాధి నిమిత్తం కామారెడ్డి షుగర్ ఫ్యాక్టరీకి పయనమయ్యారు. ఉగాది పండుగ సమయానికి తిరిగి తమ సొంతూళ్లకు చేరుకుంటారు. సంగారెడ్డి జిల్లా వాసులు ఎడ్ల బండ్లు కట్టుకుని, తమ సామగ్రిని తీసుకుని పిట్లం మీదుగా శనివారం వెళ్తుండగా.. ‘Way2News’ క్లిక్ మనిపించిన దృశ్యమిది.