News June 14, 2024
గొట్టిపాటి ఫ్యామిలీకి చంద్రబాబు పెద్దపీట
గొట్టిపాటి ఫ్యామిలీకి TDP అధినేత చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. 1995లో తన మొదటి మంత్రివర్గంలో గొట్టిపాటి హనుమంతరావుకి స్థానం ఇచ్చారు. ఇప్పుడు ఆయన తమ్ముడి కుమారుడైన గొట్టిపాటి రవికుమార్‌ను క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. అంతేకాకుండా 1999లో హనుమంతరావు కుమారుడు నరసయ్యకు MLA టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచారు. హనుమంతరావు మనమరాలైన లక్ష్మికి కూడా దర్శి టిక్కెట్ ఇచ్చారు.
Similar News
News September 11, 2024
కురిచేడు: రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
ప్రయాణిస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కురిచేడు మండలం పొట్లపాడు సమీపంలో చోటుచేసుకుంది. నంద్యాల నుంచి గుంటూరు వెళుతున్న రైలు నుంచి పడి చనిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మృతుడు వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
News September 11, 2024
కొత్తపట్నం: నమ్మించి సహజీవనం.. మరో పెళ్లికి యత్నం
కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామానికి చెందిన పులి నాగార్జున ఓ యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడేవాడు. 10ఏళ్ల తర్వాత ఇటీవల ఆమె వద్దకు వెళ్లి నమ్మించి సహజీవనం చేశాడు. కొద్ది రోజుల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు పూనుకున్నాడు. దీనిపై ఆమె ప్రశ్నిస్తే హంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడటంతో యువతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నాగార్జునతోపాటు, మరో అయిదుగురిపై కేసు నమోదు చేశారు.
News September 11, 2024
ప్రకాశం: జిల్లాలో రైతుల చూపు నర్సరీల వైపు
ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు నర్సరీల నుంచి నారు, మొక్కలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో పడినంత కష్టం లేకుండా ప్రైవేట్ నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారు. దీని వల్ల సమయం, ఖర్చు కలిసివస్తుందని, నారు ఒకే ఎత్తులో ఉంటుందని, నాణ్యతగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 2023-24 మధ్య మిరప 95,129 ఎకరాల్లో, టమోటా 1746 ఎకరాల్లో సాగైనట్లుగా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.