News June 12, 2024
గొట్టిపాటి, వీరాంజనేయస్వామి రాజకీయ నేపథ్యం..

ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను కేటాయిస్తూ చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు. కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మంత్రి పదవులకు ఎంపికయ్యారు. స్వామి 3 సార్లు, గొట్టిపాటి రవికుమార్ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇద్దరికీ ఏ శాఖలు కేటాయించనున్నారో అన్న అంశం ఆసక్తిగా మారింది.
Similar News
News March 27, 2025
అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం: స్వామి

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో అంగన్వాడీ వర్కర్లతో మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని చెప్పారు. ఖాళీలను గుర్తించి పోస్టులను భర్తీ చేస్తానన్నారు.
News March 27, 2025
ప్రకాశం: ఈ 9 మండలాల ప్రజలు జాగ్రత్త..!

ప్రకాశం జిల్లాలోని 9 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావటంతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. చీమకుర్తిలో 40.6, దర్శిలో 41.5, దొనకొండలో 40.7, కురిచేడులో 41.3, ముండ్లమూరులో 41.5, పొదిలిలో 41, పుల్లలచెరువులో 40.9, తాళ్లూరులో 41.2, త్రిపురాంతకంలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు. అత్యవసరమైతే తప్పించి ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు.
News March 27, 2025
ఒంగోలు: కంప్యూటర్ టెస్ట్ వాయిదా

ఒంగోలు ఏబీఎన్ హైస్కూల్, ముప్పవరంలోని పీఎస్ ఎన్‌సీసీ హైస్కూల్, చీరాల రామకృష్ణాపురంలోని ఎమ్మెస్ హైస్కూల్లో ఎయిడెడ్ పోస్టుల నియామకానికి ఈనెల 28, 29వ తేదీల్లో కంప్యూటర్ టెస్ట్ జరగాల్సి ఉంది. కొన్ని కారణాలతో టెస్ట్ వాయిదా వేసినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని కంప్యూటర్ టెస్ట్‌కు సంబంధించిన అభ్యర్థులు గమనించాలని కోరారు. తదుపరి తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు.