News March 30, 2024

గొట్టిపాటి V/s బూచేపల్లి

image

దర్శి రాజకీయ చర్చకు ఎట్టకేలకు తెరలేసింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పోటీగా గొట్టిపాటి లక్ష్మిని ప్రకటించగానే అభ్యర్థుల పోటీ ఖరారు అయింది. వీరిరువురి నేపథ్యం గమనిస్తే.. ఇరు కుటుంబాలు రాజకీయ వారసత్వం నుంచి వచ్చినవారే, ఇద్దరు డాక్టర్లే కావడం గమనార్హం. గొట్టిపాటి కుటుంబం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు కీలకపాత్ర పోషించారు. ఇటు తండ్రి సుబ్బారెడ్డి వారసుడిగా శివప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు.

Similar News

News April 21, 2025

మార్కాపురం: ❤ PIC OF THE DAY

image

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ డ్రోన్ ఫొటో పలువురిని ఆకట్టుకుంది. శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. రథోత్సవంలో భాగంగా డ్రోన్ కెమెరా ఈ ఫొటోను క్లిక్ మనిపించింది. పట్టణంలోని వివిద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్న పట్టణ ఫొటోను స్థానికులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

News April 21, 2025

ఒంగోలు: అంగన్వాడీలకు ఐటీసీ కిట్స్

image

అంగన్వాడీ కేంద్రాలలో ఉన్నటువంటి పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఐటీసీ వారు అందచేసిన అసెస్మెంట్ టూల్ కిట్, హబ్ అంగన్‌వాడీ మాడ్యూల్స్, పోస్టర్స్, బ్రోచర్స్, క్లాస్ మేనేజ్మెంట్ మెటీరియల్‌ను సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ మెటీరియల్‌ను జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అందచేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

News April 21, 2025

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డీఎస్సీ ద్వారా<<16156012>> 629 పోస్టులు<<>> భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-259 ➤ BC-A:44 ➤ BC-B:58
➤ BC-C:08 ➤ BC-D:46 ➤ BC-E:25
➤ SC- గ్రేడ్1:08 ➤ SC-గ్రేడ్2:38.
➤ SC-గ్రేడ్3:48 ➤ ST:33 ➤ EWS: 61
➤ PHC-HH:1

error: Content is protected !!