News July 28, 2024
గొప్పలు కాదు.. దాడులు అరికట్టండి: వైసీపీ
నెల్లూరు జిల్లాలో అత్యాచార ఘటనపై వైసీపీ మండిపడింది. ‘కావలిలో 9 సంవత్సరాల బాలికపై మహబూబ్ బాషా అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను గాలికొదిలేశారు. మీకు మీరు డబ్బా కొట్టుకుంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు. రాష్ట్రంలో పసిపిల్లలు, మైనర్ బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టండి’ అంటూ ట్వీట్ చేసింది.
Similar News
News October 14, 2024
నెల్లూరు జిల్లాలో విద్యాసంస్థల పునఃప్రారంభం వాయిదా
నెల్లూరు జిల్లాలో విద్యాసంస్థలు సోమవారం నుంచి పునః ప్రారంభించాల్సి ఉంది. దసరా పురస్కరించుకుని ఈ నెల 2 నుంచి 13వ తేదీ వరకు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నేడు తెరచుకోవాల్సిన విద్యాసంస్థలు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో .. ప్రభుత్వం అకస్మాత్తుగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
News October 13, 2024
నెల్లూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నెల్లూరు జిల్లాలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ ఆనంద్ అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించార. ప్రజలు అత్యవసర సమయంలో 0861-2331261, 7995576699 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
News October 13, 2024
ఏ.ఎస్.పేటలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఏఎస్ పేట ఎమ్మార్వో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ శ్రీరామకృష్ణ తెలిపారు. జిల్లాలో తుఫాన్ ప్రకటన నేపథ్యంలో తహశీల్దార్ కార్యాలయంలో 9177504901 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది అయినా ఈ నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.