News March 1, 2025
గొలుగొండ: మేడ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో శనివారం ఉదయం ఓ వ్యక్తి మృతి చెందాడు. సీహెచ్.నాగపురం గ్రామానికి చెందిన మరిసా కృష్ణ ప్రమాదవశాత్తు ఇంటి మేడ పైనుంచి కింద పడి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 1, 2025
కంది: ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

కంది పరిధిలోని ఐఐటీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ఏర్పాట్లను కలెక్టర్ వల్లూరు క్రాంతి ఐఐటీ డైరెక్టర్ మూర్తితో కలిసి శనివారం పరిశీలించారు. 2న ఉపరాష్ట్రపతి పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, అదనపు కలెక్టర్ మాధురి ,అధికారులు పాల్గొన్నారు.
News March 1, 2025
ఇంగ్లండ్కు నిరాశ.. సౌతాఫ్రికా విజయం

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో మ్యాచులో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని 29.1 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో డస్సెన్ (72), క్లాసన్ (64) రాణించారు. ఇప్పటికే సౌతాఫ్రికాకు సెమీస్ బెర్తు ఖరారు కాగా, ఇంగ్లండ్ ఒక్క విజయం కూడా లేకుండానే నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
News March 1, 2025
బెల్లంపల్లి: హత్యాయత్నం కేసులో నలుగురి రిమాండ్

2 రోజుల క్రితం జరిగిన హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను రిమాండ్కు తరలించినట్లు బెల్లంపల్లి రూరల్ CI అబ్జలుద్దీన్ తెలిపారు. చర్లపల్లి జంకాపూర్కు చెందిన మహేందర్పై సన్నీ, బానేశ్, ఆదిత్య, సాయి కత్తితో దాడి చేశారు. మొక్క జొన్న అమ్మకానికి గుడిసే ఏర్పాటు చేయకూడదని అతడిపై దాడి చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.