News March 16, 2025
గొల్లపల్లి మండలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలో ఆదివారం 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాయికల్లో 40.7, మల్లాపూర్లో 40.6, భీమారంలో 40.6, పెగడపల్లి లో, మెట్పల్లిలో 40.4, ధర్మపురిలో 40.4, కోరుట్లలో 40.4, ఇబ్రహీంపట్నంలో 40.3, ఎండపల్లిలో 40.2, వెల్గటూర్లో 40.2, సారంగాపూర్లో 40.2°C నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
Similar News
News October 15, 2025
విశాఖలో మహిళ దారుణ హత్య

విశాఖలో బుధవారం సాయంత్రం దారుణ హత్య జరిగింది. అక్కయ్యపాలెం నందగిరినగర్లో శ్రావణ్ సంధ్యారాణి అనే మహిళను కార్పంటెర్ శ్రీను అనే వ్యక్తి పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపేశాడు. భర్తకు దూరంగా ఉంటున్న సంధ్యారాణి అదే వీధిలో నివాసం ఉంటుంది. ఫోర్త్ టౌన్ పోలీసులు శ్రీనుని అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News October 15, 2025
హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన ఎస్పీ

జిల్లా పర్యటనలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే సురేష్ రెడ్డి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల న్యాయమూర్తి సుబ్బారెడ్డి బుధవారం ఏలూరులో పర్యటించారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు న్యాయమూర్తులకు ఏలూరు అతిథి గృహం వద్ద ఘన స్వాగతం పలికి పూలగుత్తి అందించారు. పోలీసు సిబ్బంది వారికి గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలికారు.
News October 15, 2025
దుబాయ్లో సిరిసిల్ల యువకుడి మృతి

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేటకి చెందిన యువకుడు దుబాయిలో అనుమానాస్పదంగా మృతిచెందాడు. గ్రామస్థుల ప్రకారం.. యువకుడు బిట్ల తేజ(24) బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. నెలరోజుల క్రితం స్వగ్రామానికి వస్తున్న క్రమంలో తేజ దుబాయ్లో షాపింగ్ కోసం బయటకు వెళ్లాడు. తిరిగి రూంకు రాకపోవడంతో స్నేహితులు కుటుంబీకులకు అనుమానాస్పందంగా మృతి చెందినట్లు తెలిపారు. బుధవారం అతడి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది.