News March 16, 2025

గొల్లపల్లి మండలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

image

జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలో ఆదివారం 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాయికల్‌లో 40.7, మల్లాపూర్‌లో 40.6, భీమారంలో 40.6, పెగడపల్లి లో, మెట్‌పల్లిలో 40.4, ధర్మపురిలో 40.4, కోరుట్లలో 40.4, ఇబ్రహీంపట్నంలో 40.3, ఎండపల్లిలో 40.2, వెల్గటూర్‌లో 40.2, సారంగాపూర్‌లో 40.2°C నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

Similar News

News April 20, 2025

ICICIకి రూ.13,502 కోట్ల నికర లాభం

image

జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.13,502 కోట్ల నికర లాభం వచ్చినట్లు ICICI ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 15.7 శాతం మేర నికర లాభం పెరిగినట్లు తెలిపింది. ఈ 3 నెలల్లో నికర వడ్డీ ఆదాయం 11 శాతం పెరిగి రూ.21,193 కోట్లు, వడ్డీయేతర ఆదాయం 18.4 శాతం వృద్ధితో రూ.7,021 కోట్లు నమోదైనట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.11 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బ్యాంక్ నిర్ణయించింది.

News April 20, 2025

నిజామాబాద్: గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

image

నందిపేట్ మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన పొగరు రవి కిరణ్ ఫిర్యాదుపై నిజామాబాద్ జిల్లా సీపీ సాయి చైతన్య స్పందించారు. గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి చీటింగ్, ఇమిగ్రేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి పలు గ్రామాలకు చెందిన సుమారు 80 మందిని ముఠా సభ్యులు మోసం చేసినట్లుగా గుర్తించినట్లు సీపీ పేర్కొన్నారు.

News April 20, 2025

ఏప్రిల్ 20: చరిత్రలో ఈరోజు

image

✒ 1889: జర్మనీ నియంత హిట్లర్ జననం
✒ 1950: ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు జననం
✒ 1930: సినీ రచయిత త్రిపురనేని మహారథి జననం
✒ 1972: సినీ నటి మమతా కులకర్ణి జననం
✒ 1972: సినీ నటి అంజలా జవేరీ జననం
✒ 1992: టాలీవుడ్ తొలి నేపథ్య గాయకుడు ఎమ్ఎస్ రామారావు మరణం

error: Content is protected !!