News March 9, 2025
గొల్లప్రోలు: ఆ వ్యక్తి ఎవరు?

గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్డులో పోలవరం కాలువ చెంతన గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైన ఘటనపై దర్యాప్తు కోసం 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బైపాస్ రోడ్డులో వ్యక్తి మరణించి ఉండగా పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. పోలీసులకు ఆరు రోజులైనా ఎలాంచి క్లూ లభించలేదు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఏ ఊరు వేరే ప్రాంతంలో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి వదిలివేశారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 7, 2025
కల్వకుర్తి: ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున శనివారం సాయంత్రం కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ప్రజాప్రతినిధులు సహా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై మాధవ రెడ్డి సూచించారు. వాహనాల తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.
News December 7, 2025
ఫ్లోర్ బాల్ అనంతపురం జిల్లా జట్టు ఇదే..!

రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలకు అనంతపురం జిల్లా జట్టు సిద్ధమైంది. ఇవాళ నరసరావుపేటలో జరగనున్న 19వ సీనియర్ ఫ్లోర్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో అనంతపురం జిల్లా జట్టు పాల్గొంటుందని జిల్లా సెక్రటరీ కె.లక్ష్మీనారాయణ తెలిపారు. క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
News December 7, 2025
అర్ధరాత్రి తినే అలవాటు ఎంత ప్రమాదమంటే?

అర్ధరాత్రి తినే అలవాటు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘లేట్ నైట్ తినే అలవాటు మీ నిద్ర, జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. రాత్రి సమయంలో మీ శరీరం ఫ్యాట్‌ని బర్న్ చేస్తుంది. కానీ, మీరు తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ మోడ్ కాస్తా స్టోరేజ్ మోడ్‌కు వెళ్తుంది. దాంతో మీ శరీరం బరువు పెరుగుతుంది. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది’ అని చెబుతున్నారు.


